వైట్‌హౌస్‌లో మళ్ళీ ఆసక్తికర పరిణామం

వైట్‌హౌస్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ కోడికి క్షమాభిక్ష పెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. టర్కీ కోడిని.. నీకు పూర్తి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నాను.. అంటూ జీవించడానికి వదిలేశారు. కోడికి క్షమాభిక్ష పెట్టడమేంటి? అదేం తప్పు చేసింది? అనుకోవచ్చు. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది. అధికారం నుంచి దిగిపోయే అమెరికా అధ్యక్షులకు టర్కీ నుంచి కోళ్లను బహుమతిగా పంపిస్తారు. అధ్యక్షుడు వాటిని కోసుకొని తినడమో, లేదా క్షమించి వదిలేయడమో చేస్తారు. ఇది వైట్ హౌస్‌లో ఆనవాయితీగా వస్తున్న పద్ధతి.
వైట్‌హౌస్‌లో సంప్రదాయం ప్రకారం నిర్వహించే థ్యాంక్స్ గివింగ్ డేలో డొనాల్డ్ ట్రంప్, మెలానియా దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ది నేషనల్ థ్యాంక్స్ గివింగ్ టర్కీ వేడుక జరిగింది. వైట్‌హౌస్ రోజ్‌గార్డెన్‌లో జరిగిన ఆ కార్యక్రమంలో ట్రంప్ తనదైన శైలిలో జోకులు వేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా కార్న్ అనే టర్కీ కోడిని క్షమించి ప్రాణభిక్ష పెట్టారు. దీంతో పాటు కోబ్ అనే టర్కీ కోడిని కూడా క్షమించి వదిలేశారు. అనంతరం రుచికరమైన వంటకాలతో విందు కొనసాగింది.
జార్జి డబ్ల్యూ బుష్‌కు ముందు అధ్యక్షులందరూ ఇలా బహుమతిగా వచ్చే టర్కీ కోళ్లను విందులో వినియోగించే వారు. జాన్ ఎఫ్ కెనడీ, రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ తదితరులు మాత్రం వీటిని తినకుండా వదిలేశారు. కొంత మంది అధ్యక్షులు అసలు వాటిని స్వీకరించనేలేదు. 1989లో అధికారికంగా జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ అధక్ష్య క్షమాభిక్ష అనే పదాన్ని వాడి బహుమతిగా వచ్చిన టర్కీ కోడిని జీవించేందుకు వదిలేశారు. నాటి నుంచి వైట్ హౌస్‌లో ఇది సంప్రదాయంగా కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com