Trump : జో బైడెన్ అనారోగ్యంపై ట్రంప్ స్పందన

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా బైడెన్ అనారోగ్యం గురించి సోషల్ మీడియాలో స్పందించారు. జో బైడెన్ ఇటీవలి వైద్య పరిస్థితి గురించి విని తాను చాలా బాధపడ్డానన్నారు. బైడెన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామంటూ X అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. జో బైడెన్ 2021 నుంచి 2025 వరకు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలో విఫలమైన తర్వాత, గత ఏడాది జూలైలో అమెరికా ఎన్నికల బరి నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు. ఈ సంఘటన తర్వాత, డెమోక్రటిక్ పార్టీలో ఆందోళనలు వ్యాపించాయి. పార్టీ కొత్త అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఎంపిక చేశారు. కానీ 2024 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె ట్రంప్ చేతిలో ఓడిపోయారు. బైడెన్ క్యాన్సర్ వార్త అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com