Trump: హమాస్ అంతం కావాల్సిందే.. పని పూర్తి చేయాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచన

Trump: హమాస్ అంతం కావాల్సిందే.. పని పూర్తి చేయాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచన
X
అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన కాల్పుల విరమణ చర్చలు విఫలలం

కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్‌ తిరస్కరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ హమాస్‌పై విరుచుకుపడ్డారు. హమాస్‌కు శాంతి నెలకొల్పడంపై ఆసక్తిలేదని వ్యాఖ్యానించారు. ఇక హమాస్‌ కథ ముగించాల్సిందేనని పేర్కొన్నారు. గాజాలో దాడులు తీవ్రతరం చేయాలంటూ ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు సూచించారు.

స్కాట్లాండ్‌ పర్యటనకు వెళ్లే ముందు ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘హమాస్‌కు ఎటువంటి డీల్ చేసుకునేందుకు ఇష్టం లేదు. వాళ్లకు శాంతి నెలకొల్పడంపై ఆసక్తి లేదు. వాళ్లు చావాలని కోరుకుంటున్నట్టు ఉంది. ఇది చాలా దారుణం. ఇక దాని కథ ముగించాల్సిందే. గాజా లో మొదలు పెట్టిన పనిని పూర్తి చేయాలి. ప్రక్షాళన చేయండి. దాడులను ఉద్ధృతం చేయండి’ అంటూ ఇజ్రాయెల్‌ కు ట్రంప్‌ సూచించారు.

కాగా, మధ్యప్రాచ్యంలో శాంతి చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌ హమాస్‌తో చర్చల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో తమ వ్యూహాల్ని సమీక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. చర్చల్లో ప్రతిష్టంభనకు హమాస్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇక హమాస్ చెరలో బందీలను విడిపించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ తెలిపారు.

Tags

Next Story