Trump-Putin: పుతిన్‌కు ట్రంప్ మరోసారి వార్నింగ్..మాట వినకుంటే ఆంక్షలకు బలి కావాల్సిందే..!

Trump-Putin: పుతిన్‌కు ట్రంప్ మరోసారి వార్నింగ్..మాట వినకుంటే ఆంక్షలకు బలి కావాల్సిందే..!
X
2 వారాల్లో శాంతి ఒప్పందం చేసుకోవాలని హెచ్చరిక

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తు్న్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కృషి చేస్తున్నారు. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపానని పదే పదే చెబుతున్నారు. ఇక ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపినట్లు ప్రకటించారు. తాజాగా థాయ్‌లాండ్-కంబోడియా మధ్య కూడా యుద్ధాన్ని ఆపానని వెల్లడించారు. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు ముందుకొస్తుంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో పుతిన్‌పై తీవ్ర స్థాయిలో ట్రంప్‌నకు కోపం వస్తోంది. అనేక మార్లు రష్యాను హెచ్చరించారు.

తాజాగా మరోసారి పుతిన్‌ను ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి అంగీకరించడానికి 10-12 రోజుల సమయం ఉందని.. ఆ సమయంలోగా అంగీకరించాలని లేదంటే ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ కుదరకపోతే త్వరలో రష్యాపై ద్వితీయ సుంకాలు విధించనున్నట్లు హెచ్చరికలు పంపారు. గతంలో పుతిన్‌కు 50 రోజుల సమయం ఇచ్చారు. తాజాగా ఆ సమయాన్ని తగ్గిస్తూ సోమవారం తాజా హెచ్చరికలు జారీ చేశారు. 10-12 రోజుల్లో ఏదొకటి తేల్చాల్సిందేనని పేర్కొన్నారు.

దాదాపు 4 ఏళ్ల నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరుదేశాలు యుద్ధం కారణంగా ఎంతో నష్టపోయాయి. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలు ఫలించలేదు. దీంతో ట్రంప్ విసుగు చెందారు. రష్యాను దెబ్బకొట్టేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా 100 శాతం సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు.

Tags

Next Story