Trump: మరో వెనిజులా నౌక పేల్చివేత.. ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటన

అంతర్జాతీయ జలాల్లో అమెరికా వెళ్తున్న వెనిజులా మాదకద్రవ్య నౌకను అమెరికా సైన్యం పేల్చేసింది. ఈ మేరకు ట్రంప్ ప్రకటించారు. మాదక ద్రవ్యాలు అమెరికన్లను విషపూరితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నౌక అమెరికా వైపు వస్తోందని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. అయితే అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లుగా మాత్రం ఎలాంటి ఆధారాలు లభించకపోవడం ఆశ్చర్యం. ఇటీవల వెనిజులాకు చెందిన నౌకను పేల్చినప్పుడు 11 మంది చనిపోయారు. తాజా దాడిలో ఇద్దరు చనిపోయారు.
దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. వెనిజులా ప్రధాని నికోలస్ ముదరో మాట్లాడుతూ.. అమెరికా దూకుడు నుంచి తమను తాము రక్షించుకుంటామని చెప్పారు. అమెరికా దౌత్యవేత్త మార్కో రూబియో యుద్ధానికి ప్రభువుగా అభవర్ణించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి, దేశాన్ని రక్షించడానికి పదివేల మంది సైనికులను మోహరించినట్లు వెనిజులా ప్రభుత్వం తెలిపింది.
మాదక ద్రవ్యాల ముఠాలను అడ్డుకునేందుకు అమెరికా దళాలు భారీగా మోహరించాయి. మొత్తం 8 వార్‌షిప్‌లను పంపింది. 4,500 మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. 22వ మెరైన్ యూనిట్ కమాండోలు 2,200 మంది ఈ నౌకల్లో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com