కౌటింగ్ ఆపుతారా.. కోర్టుకు వెళతా: ట్రంప్

కౌటింగ్ ఆపుతారా.. కోర్టుకు వెళతా: ట్రంప్
చట్టాన్ని సరిగ్గా ఉపయోగించి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అక్రమాలకు పాల్పడడం దురదృష్టకరం.

అమెరికా ఎలక్షన్స్‌లో అక్రమాలు జరుగుతున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారు.. ఈ విషయమై నేను సుప్రీం కోర్టుకు వెళుతున్నా. ఎన్నికల కౌంటింగ్‌ను వెంటనే ఆపేయండి.. ఎలాగూ మేమే విజయం సాధిస్తాం.. చట్టాన్ని సరిగ్గా ఉపయోగించి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అక్రమాలకు పాల్పడడం దురదృష్టకరం.. అందుకే ఎన్నికలు ఆపేయాలని కోరుతున్నాం అని ట్రంప్ కామెంట్ చేశారు.

అదే సమయంలో భారీ విజయానికి సిద్ధంగా ఉండాలంటూ అమెరికా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నికల ఫలితాలు క్షణక్షణానికి మారిపోతూ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఎలక్టోరల్ ఓట్లలో బైడెను 238 రాగా, ట్రంప్‌కు 213 ఓట్లు వచ్చాయి. ఇంకా ఫలితాలు వెలువడాల్సిన రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. కాగా మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు గాను 270 ఓట్లు వచ్చిన వారినే అమెరికా అధ్యక్షుడిగా ప్రకటిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story