H-1B visa fee hike: H-1B వీసాలపై ట్రంప్ .. టాలెంటెడ్ వర్కర్లను కోల్పోనున్న యూఎస్..

H-1B visa fee hike: H-1B వీసాలపై ట్రంప్ .. టాలెంటెడ్ వర్కర్లను కోల్పోనున్న యూఎస్..
X
భారత్‌కే లాభం అంటున్న విశ్లేషకులు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. H-1B వీసాలపై USD 100,000 (రూ. 88 లక్షలకు పైగా) వార్షిక రుసుము విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇది ప్రధానంగా నైపుణ్యం కలిగిన భారతీయ వర్కర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే, ఈ నిర్ణయంతో అమెరికా సెల్ఫ్ గోల్ చేసుకుందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది భారత్‌కు కలిసి వస్తుందని అంటున్నారు.

హెచ్1బీ వీసా ద్వారా అమెరికన్ కంపెనీలు టాలెంటెడ్ ఇండియన్ ఉద్యోగుల్ని నియమించుకుంటుంది. తక్కువ ఖర్చుతో మంచి టాలెంట్‌ని కొనుగోలు చేస్తున్నామని కంపెనీలు అనుకుంటున్నాయి. అయితే, దీని వల్ల స్థానిక అమెరికన్లు నష్టపోతున్నారని అక్కడ కొంత మంది వాదిస్తున్నారు. ట్రంప్ చర్యలు కూడా స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు పెంచే యోచనగా చూడబడుతోంది.

మాజీ దౌత్యవేత్త, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్‌తో సహా చాలా మంది ట్రంప్ చర్యను విమర్శించారు. H1-B రుసుము భారత ఆర్థిక వ్యవస్థను కాదు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని నొక్కి చెప్పారు. ట్రంప్ నిర్ణయం అమెరికాకే నష్టం చేస్తుందని, భారత్‌కు లాభమని అమితాబ్ కాంత్ అన్నారు. ఇది యూఎస్ ఆవిష్కరణను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని, భారత దేశానికి టర్బో‌చార్జ్‌ను ఇస్తుందని చెప్పారు. ‘‘ప్రపంచ ప్రతిభకు తలుపులు మూసేయదడం ద్వారా అమెరికా ల్యాబ్‌లు, పేటెంట్లు ఆవిష్కరణలు, స్టార్టప్‌లు ఇప్పుడు బెంగళూర్, హైదరాబాద్, పూణే, గుర్గావ్‌కు వస్తాయి. భారతదేశంలో అత్యుత్తమ వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల ఆవిష్కరణలు భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు పురోగమించేలా చేస్తాయి’’ అని ట్వీట్ చేశారు.

ట్రంప్ నిర్ణయం వల్ల, అమెరికాలో ఉంటున్న భారత మేధావులు తిరిగి స్వదేశానికి వచ్చి మాతృభూమికి తమ టాలెంట్‌ను అందించే అవకాశాన్ని కల్పించింది. భారతదేశం లోని నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ చర్యల అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని అన్నారు. అదే సమయంలో భారత వృద్ధికి దోహదపడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. “H-1B వీసాలపై ట్రంప్ రూ. 90 లక్షల రుసుము వసూలు చేశారు. ఇది భారతదేశానికి మంచిది, వారి పిల్లలను విదేశాలకు పంపిన అతి ధనవంతులు ఇప్పుడు వారిని ఇక్కడే ఉంచుతారు, ప్రభుత్వం నుండి మెరుగైన మౌలిక సదుపాయాలను డిమాండ్ చేస్తారు” అని ఒక నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇన్ఫోసిస్ ఎక్స్‌పర్ట్, ఇన్వెస్టర్ మోహన్ దాస్ పాయ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. భారతదేశ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను పెంచుతూ, యూఎస్ సంస్థలు తమ పనిని ఆఫ్‌షోర్‌కు మారుస్తాయని చెప్పారు. మరింత ప్రతిభ దేశానికి తిరిగి వస్తుందని చెప్పారు. కొత్త నియమాలు చాలా మంది నైపుణ్యం కలిగిన నిపుణులు స్వదేశానికి రావడాన్ని ప్రేరేపిస్తాయని స్నాప్‌డీల్ వ్యవస్థాపకుడు కునాల్ బహ్ల్ అన్నారు.

ట్రంప్ నిర్ణయంపై సొంతదేశం అమెరికాలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి దీనిని ‘‘నిర్లక్ష్యం’’, ‘‘దురదృష్టకరం’’ అని పిలిచారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేసిని నైపుణ్యం కలిగిన వర్కర్లను తగ్గించే ప్రమాదంగా అభివర్ణించారు. ట్రంప్ నిర్ణయం పట్ల అమెరికాలోని టెక్ వర్గాలు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story