ట్రంప్ ఆసుపత్రి నుంచి బయటకు రావడం ఎన్నికల స్టంటేనా?

ట్రంప్ ఆసుపత్రి నుంచి బయటకు రావడం ఎన్నికల స్టంటేనా?
ఎలక్షన్స్ టైంలో ఆరోగ్యం బాగాలేకపోయితే..నేతలు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు.ట్రంప్‌ కూడా అదే పనిచేస్తున్నారనే

ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు రేకెత్తుతున్న వేళ సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు. కారులో షికార్లు చేస్తూ అభిమానులు, మద్దతు దారులకు కనిపించారు. తన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పులేదనే సంకేతాలు ఇచ్చారు. అయితే ట్రంప్ ఆసుపత్రి నుంచి బయటకు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ట్రంప్ కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. శుక్రవారం ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం సాయంత్రం కాసేపు బయటకు వచ్చి మద్దతు దారులకు కనిపించి వెళ్లారు.

ట్రంప్‌తోపాటు కారులో ప్రయాణించిన భద్రతా సిబ్బంది ఆరోగ్యానికి ముప్పు పొంచివుందని ట్రంప్‌కు చికిత్స చేసిన డాక్టర్ జేమ్స్ పిలిప్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని... వారందరికీ 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచాలన్నారు. లేదంటే వారందరి ప్రాణాలకు ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు ఇప్పటికే రెండుసార్లు ట్రంప్ ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో రాజకీయ నాయకులు జిమ్మిక్కులు చేయడం కొత్తకాదు. ఏ కాస్త ఛాన్స్ దొరికినా సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నిస్తారు. ఎలక్షన్స్ టైంలో ఏ చిన్న ప్రమాదం జరిగినా.. ఆరోగ్యం బాగాలేకపోయినా.. నేతలు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ట్రంప్‌ కూడా అదే పనిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. రెండోసారి అధ్యక్ష పదవి కోసం ట్రంప్ పోటీ చేస్తున్నారు.

ప్రచారం పీక్ మీదున్న టైంలో ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ట్రంప్‌ ఆసుపత్రిలో చేరక తప్పలేదు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ రకరకాల వదంతులు వచ్చాయి. డాక్టర్లు మాత్రం ట్రంప్‌కు ప్రమాదమేమీ లేదని ప్రకటించారు. సోమవారం సాయంత్రం డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు. కానీ ఇంతలోనే ట్రంప్‌ ఆసుపత్రి నుంచి కారులో బయటకు వచ్చి చక్కర్లు కొట్టడంతో ఎన్నికల స్టంట్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story