US: ఆర్థిక మాంద్యంలోకి అమెరికా..?

US: ఆర్థిక మాంద్యంలోకి అమెరికా..?
X
ప్రతీకార సుంకాల ప్రకటనతో వాణిజ్య యుద్ధం... అమెరికన్లలో పెరుగుతున్న భయాలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆ దేశంలో భయాందోళనలు రేపుతున్నాయి. భారీ సుంకాల ప్రకటనతో అగ్రరాజ్య ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా మరోసారి ఆర్థికమాంద్యంలోకి జారుకుంటుందన్న భయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివిధ దేశాలపై సుంకాల ప్రకటనతో వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వినట్లు అయింది. ట్రంప్ సుంకాల ప్రకటనతో అమెరికా షేర్లు మార్కెట్లు కుప్పకూలాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా భారీగా పతనమయ్యాయి.

ఆర్థికమాంద్యం భయాలు

అమెరికాలో ఆర్థికమాంద్యం భయాలు మరింత పెరిగాయి. అక్కడి షేర్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. డౌజోన్స్‌ 1500 పాయింట్లకు పైగా నష్టంతో 40,665 వద్ద ట్రేడయింది. నాస్‌డాక్‌ దాదాపు 5 శాతం మేర క్షీణించింది. ఎస్‌అండ్‌పీ 500 4 శాతం కుంగింది. నైకీ 12 శాతం మేర పతనం అవ్వగా.. యాపిల్ షేర్లు 9 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐఫోన్లకు ప్రధాన సప్లయర్‌గా ఉన్న చైనాపై... అమెరికా 54 శాతం భారీ సుంకాలు విధించడంతో సప్లయ్‌ చైన్‌కు అవరోధం ఏర్పడుతుందన్న ఆందోళనలతో ఆ కంపెనీలు షేర్లు భారీగా కుంగాయి. 2020 తర్వాత యాపిల్‌ స్టాక్‌ ఈ స్థాయిలోపతనం కావడం ఇదే తొలిసారి. మెటా, టెస్లా, అమెజాన్‌ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. క్రిప్టో కరెన్సీలోనూ ట్రంప్‌ సుంకాల ఎఫెక్ట్‌ కనిపించింది. బిట్‌కాయిన్‌ 5 శాతం మేర పతనమైంది. ఎథీరియం 7 శాతం, సోలానా 13 శాతం మేర విలువలు కోల్పోయాయి. విధించక పోవడం, భారత్‌లో ఉక్కుకు ఉన్న డిమాండ్ దీనికి కారణాలు.

భారత్‌ వైపు చూపు

టారిఫ్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాల ఆర్థివక వ్యవస్థను కుదిపేస్తోంది. ముఖ్యంగా ఆటో మొబైల్స్, అల్యూమినియం, స్టెయిన్‌ లెస్ స్టీల్‌ దిగుమతలపై అధిక టారిఫ్‌లు విధించదంతో చాలా దేశాలు తమ వాణిజ్య మార్కెట్ ను మార్చుకోవాలని చూస్తున్నాయి. పల్లం ఎటుంటే అటే నీళ్లు పారుతాయన్నట్టుగా.. అధిక టారిఫ్‌లను ఎదుర్కొంటున్న దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. చైనా (54 శాతం), వియత్నాం (46 శాతం), థాయిలాండ్ (36 శాతం), బంగ్లాదేశ్ (37 శాతం)‌లపై అమెరికా అధిక టారిఫ్‌లు విధించింది. ఇది భారత్‌కు కలిసిరానుంది. టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, మెషినరీ రంగాల్లో అవకాశం అందివచ్చిందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story