చైనాకు వాణిజ్యపరంగా మరో ఎదురుదెబ్బ.. అమెరికాలో..

చైనాకు వాణిజ్యపరంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. నిన్నటి నుంచి చైనా మెసేజింగ్ యాప్ వీచాట్ , వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ పై అమెరికాలో నిషేధం విధించినట్టు యుఎస్ వాణిజ్య విభాగం తెలిపింది. ఆదివారం నుంచి యాపిల్ మరియు గూగుల్ ప్లే స్టోర్ నుంచి టిక్‌టాక్, వీచాట్ యాప్ లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. గత కొన్ని వారాలుగా, టిక్‌టాక్ మాతృ సంస్థ అయిన బైట్‌డాన్స్.. మైక్రోసాఫ్ట్ , ఒరాకిల్ వంటి యుఎస్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది.
వినియోగదారు డేటా భద్రతపై ట్రంప్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో 'టిక్‌టాక్ గ్లోబల్' అనే కొత్త సంస్థను ఏర్పాటు చెయ్యాడానికి ఈ చర్చలు జరిగాయి. దీనిని యుఎస్ కంపెనీకి సెప్టెంబర్ 15 లోగా విక్రయించకపోతే యుఎస్ టిక్‌టాక్ కార్యకలాపాలను మూసివేయాలని అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ దిశగా అడుగులు పడకపోవడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com