TRUMP: హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ బిగ్ షాక్

TRUMP: హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ బిగ్ షాక్
X
హార్వర్డ్‌పై బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు.. అమెరికన్లతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళన పరుస్తున్నాయి. ఇప్పటికే వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్.. విశ్వ విద్యాలయాల్లో చదువుతురూ.85వేల కోట్లతో చమురు నౌకల కొనుగోలున్న భారత విద్యార్థులతో సహా విదేశీ విద్యార్థులపైనా కత్తి కట్టారు. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీపై పగబట్టిన ట్రంప్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ విద్యార్థుల నమోదుపై ట్రంప్ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ నిర్ణయం ప్రతీకార చర్య అని హార్వర్డ్ పేర్కొంది. ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

బదిలీ కావాల్సిందే...

హార్వర్డ్ విశ్వవిద్యాలయం విషయంలో ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి హార్వర్డ్‌ యూనివర్సిటీకి ఉన్న అనుమతిని రద్దు చేసింది. ఈ కారణంగా అక్కడే చదువుతున్న భారత విద్యార్థులు సహా ఇతర విదేశీ విద్యార్థులపై కూడా ప్రభావం పడుతుంది. ట్రంప్ నిర్ణయంతో ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విదేశీ విద్యార్థులు... ఇప్పుడు వేరే యూనివర్సిటీకి బదిలీ కావాల్సిందే. లేదంటే అమెరికాలో చట్టపరమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది.

తమ విద్యాసంస్థలో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్‌తో విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. హార్వర్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం.. ప్రస్తుత ఏడాది ఈ యూనివర్సిటీలో 6,800 మంది విదేశీ విద్యార్థులు నమోదు చేసుకున్నారు. విశ్వవిద్యాలయంలోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో 27శాతం మంది విదేశీయులు. వీరిలో ఎక్కువమంది గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్సే ఉన్నారు. ఇక భారత్‌ నుంచి 788 మంది ఈ యూనివర్సిటీలో ప్రవేశం పొందారు.

ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాల రద్దు 2025-26 విద్యా సంవత్సరం నుంచి వర్తించనుంది. ఒకవేళ ప్రభుత్వం దీనిపై నిర్ణయం మార్చుకోకపోయినా, కోర్టు నుంచి ఊరట లభించకపోయినా.. ఈ ఏడాది విదేశీయులకు ఇచ్చిన ప్రవేశాలన్నీ రద్దయినట్లే. ఇప్పటికే ఈ సెమిస్టర్‌తో డిగ్రీలు పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేట్‌గా బయటకు రావొచ్చు. కానీ, ఒకవేళ చదువు మధ్యలో ఉన్నవారైతే మాత్రం.. తప్పనిసరిగా మరో ఇనిస్టిట్యూట్‌కు మారాల్సి ఉంటుంది. లేదంటే చట్టబద్ధమైన హోదాను కోల్పోతారు.

Tags

Next Story