కీలక ప్రాంతాల్లో గెలుపొందిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా ఫలితాలు రావాల్సిన 7 రాష్ట్రాలు రెండు పార్టీలను ఊరిస్తున్నాయి.. ప్రస్తుతానికి ఆరు చోట్ల ట్రంప్ ఆధిక్యంలో ఉండగా.. బైడెన్ ఒక రాష్ట్రంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.. అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి 270 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కాగా.. ఇప్పటి వరకు బైడెన్ 238 , ట్రంప్ 213 రాష్ట్రాల్లో విజయం సాధించారు. అయితే కీలక ప్రాంతాల్లో మాత్రం ట్రంప్ గెలుపొందారు.
పెన్సిలెవినియా, ఒహియా, నార్త్ కరోలినా, మిషిగాన్‌ల్లో ట్రంప్ స్వల ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం లీడ్‌లో ఉన్న ఈ రా ష్ట్రాల్లో ట్రంప్ గెలిస్తే మాత్రం ఫలితాలు తారుమారవుతాయి. ఫ్లోరిడాలో నెగ్గిన పార్టీదే విజయం అనే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఈ సారి ట్రంప్ అక్కడ విజయం సాధించారు.. మరి తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి..
మొదటి నుంచి దాదాపు అంతర్జాతీయ మీడియా అంతా బైడెన్‌దే విజయం అంటూ ప్రసారం చేశాయి. కానీ అనూహ్యంగా రిపబ్లికన్ పార్టీ పుంజుకుంది. అతిపెద్ద రాష్ట్రం టెక్సాస్ ట్రంప్ ఖాతాలోకే చేరింది. మరోవైపు సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే ఫ్లోరిడాలోనూ డోనాల్డ్ ట్రంప్ పాగా వేశారు.
ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు చూస్తే.. కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లోనియా, న్యూజెర్సీ, వాషింగ్టన్, విర్జినియా, మ్యారీలాండ్, కొలరాడా రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు కనెక్టికట్, డెలావేర్, ఇల్లినాయి, మేరీలాండ్, న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్, కొలరెడో రాష్ట్రాల్లో బైడెన్ గెలుపొందారు..
ఫ్లోరిడా, టెక్సాస్‌తో పాటు వ్యోమింగ్, వెస్ట్ వర్జీనియా, టెన్సెసీ, సౌత్ డకోటా, సౌత్ కరోలైనా, ఒక్లహామా, లూసియాన, కెంటకీ, మిస్సిసిపీ, ఇండియానాల్లో ట్రంప్ గెలుపొందారు.
అనూహ్యాంగా సొంత రాష్ట్రం పెన్సిల్వేనియా బైడెన్ వెనుకబడ్డారు. ఈ రాష్ట్రాన్ని ట్రంప్, బైడెన్‌లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు. తుదివిడత ప్రచారంలో దీనిపై ఎక్కువ దృష్టి సారించారు. కీలకమైన స్వింగ్‌స్టేట్స్‌లో అత్యధిక ఓటర్లు ఉన్న మూడో పెద్ద రాష్ట్రం. ఇక్కడ దాదాపు 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో గెలుపు కోసం బైడెన్ విపరీతంగా శ్రమించారు. 2016లో ఈ రాష్ట్రం ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించింది. గతంలో డెమొక్రాట్లకు ఇక్కడ పట్టు ఉండగా..
గత ఎన్నికల్లో ఇది రిపబ్లికన్ల ఖాతాలో చేరింది. అంతకు ముందు ఇక్కడ డెమొక్రాట్లు ఆరు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అన్నింటికి మించి ఇది జో బైడెన్ సొంత రాష్ట్రం. దీంతో ఇక్కడి ఎన్నిక ఆయనకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడ మూడు వారాల క్రితం వరకు నిర్వహించిన అభిప్రాయ సేకరణల్లో బైడెన్ దాదాపు 7 పాయింట్ల వరకు ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. కానీ, చివర్లో ట్రంప్ దూకుడుగా పుంజుకొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com