ఫ్లోరిడా విషయంలో తల్లకిందులైన ప్రీపోల్స్‌

ఫ్లోరిడా విషయంలో తల్లకిందులైన ప్రీపోల్స్‌

అమెరికా అధ్యక్ష ఫలితాల్లో ఉత్కంఠ ఇంకా పెరుగుతూ వస్తోంది. క్షణ క్షణానికి రిజల్ట్ మారుతూ వస్తోంది. ప్రస్తుతం బైడెన్‌కు 238, ట్రంప్‌కు 213 ఓట్లు వచ్చాయి. ట్రంప్‌-బైడెన్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లు అధ్యక్ష పీఠం కోసం పోటీ జరుగుతోంది. తాజాగా జో బైడెన్‌ ఆరిజోనాలో గెలుపొందారు. ఇంకా ఏడు రాష్ట్రాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. మరో 7 రాష్ట్రాల్లో ఫలితం రావాల్సి ఉండగా.. ట్రంప్‌ ఆరు చోట్ల, బైడెన్‌ ఒక చోట ఆధిక్యంలో ఉన్నారు..

కీలక రాష్ట్రాలైన జార్జియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్‌ ల్లో ట్రంప్‌ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మరోవైపు మిషిగాన్, పెన్సిల్వేనియాలో ట్రంప్ మెజార్టీతో రిపబ్లికన్‌ పార్టీ లీడర్లు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం నెవెడాలో మాత్రమే బైడెన్‌కి ఆధిక్యం ఉంది.. కౌంటింగ్‌ పూర్తి అయ్యే సమయానికి 270 మ్యాజిక్‌ ఫిగర్‌ను ఎవరు అందుకుంటే వారిదే విజయం.. ప్రస్తుతానికి బైడెన్‌ 238, ట్రంప్‌ 213 చోట్ల గెలుపొందగా.. ఆధిక్యంలో ఉన్న రాష్ట్రాల్లో ట్రంప్‌ ముందంజలో ఉండడంతో ఫలితంపై ఉత్కంఠ పెరిగింది..

ఇంకా 94 స్థానాల్లో ఓట్లు లెక్కింపు మిగిలి ఉంది. అందులో బైడెన్ 6 చోట్ల.. ట్రంప్‌ 88 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.. సో ఆధిక్యంలో ఉన్న చోట్ల ట్రంప్‌ పట్టు నిలుపుకుంటే వరుసగా రెండో సారి అధ్యక్ష పీటం సొంతమవుతుంది. అనూహ్యంగా బైడెన్‌ పుంజుకుంటే మాత్రం ఫలితాలు తారుమారు అవుతాయి..

ఈ ఫలితాలు చూస్తుంటే.. ట్రంప్‌ "మేక్ అమెరికా గ్రేట్ అగైన్" నినాదం పనిచేసిందా..? అనే అంచనా వేస్తున్నారు. కరోనా కల్లోలాన్ని, జాతివివక్ష విమర్శల్ని తట్టుకుని ట్రంప్ విజయం సాధిస్తారా..!? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బైడెన్‌ సొంత రాష్ట్రం పెన్సిల్వేనియాలో ఓటమి పాలవ్వడం డెమోక్రాట్లను దెబ్బ తీసింది. అలాగే ఫ్లోరిడా విషయంలో తల్లకిందులైన ప్రీపోల్స్‌ అంచనాలు అన్నీ తల్లకిందులు అయ్యాయి. అనూహ్యంగా ట్రంప్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు.

Tags

Read MoreRead Less
Next Story