టిక్‌టాక్ విషయంలో ట్రంప్ సర్కార్‌కి చుక్కెదురు
టిక్‌టాక్ యాప్ నిషేధించాలని ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్ సర్కార్‌కు డిస్టిక్ట్ ఆఫ్ కొలంబియాలోని జిల్లా కోర్టులో చుక్కెదురైంది. అయితే ఒక్క టిక్‌టాక్ తో పాటు నవంబర్ 12 నుంచి అమల్లోకి రానున్న ఇతర వాణిజ్యశాఖ ఆంక్షల వాయిదాను కూడా కోర్టు తోసిపుచ్చింది. నిషేధం ఉత్తర్వులు అమల్లోకి రావడానికి కొద్ది గంటల ముందే ట్రంప్ ఆలోచనలనకు కోర్టు బ్రేక్ వేసింది.
ట్రంప్ సర్కార్ నిషధం విధించడాన్ని టిక్‌టాక్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ఒప్పందానికి విరుద్ధమని, టిక్‌టాక్ కేవలం యాప్ కాదని, పౌరులందరికీ ఉపయోగపడే ఆధునిక వేదిక అని, తక్షణం నిషేధం విధిస్తే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని టిక్‌టాక్ న్యాయవాది జాన్‌హాల్ వాదించారు. అయితే, ఈ యాప్ వలన వ్యక్తిగత సమాచారం భద్రతకు ముప్పుఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com