Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

రష్యాలో ఆదివారం ఉదయం వరుసగా కొద్ది నిమిషాల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించాయి. తొలుత రిక్టర్ స్కేల్‌పై 5, ఆ తర్వాత 6. 7 తీవ్రతతో భూకంపాలు రాగా.. ఆ తర్వాత కొద్దిసేపటిక 7.4 తీవ్రతతో మరో భూకంపం సంబంధించింది. రష్యా తూర్పు తీరంలో ఈ భూకంపం వచ్చినట్టు అధికారులు తెలిపారు. దీంతో రష్యాలోని కమ్చట్కా ద్వీపానికి పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ వార్నింగ్ జారీ చేసింది. అయితే, భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు. కానీ,, పౌరులు ఆ ప్రాంతం వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచనలు జారీ చేశారు. దీనికి కొద్ది నిమిషాల ముందు 6.7 తీవ్రతతో మరో భూకంపం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించారు. కాగా, శనివారం (జులై 19) తెల్లవారుజామున కిందట ఉత్తర అమెరికాలోని అలస్కాలోనూ 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో సునానీ హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే.
రష్యా తూర్పు తీరంలోని పెట్రోపెట్రోపావ్లోవ్స్క్- కమ్చట్కా నగరానికి తూర్పుగా 144 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. ఇది 20 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు తెలిపారు. కమ్చట్కా నగరంలో దాదాపు లక్ష మంది జనాభా ఉన్నారు. దీనికి ముందు రిక్టర్ స్కేల్‌పై 5, 6.7 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. కానీ, మూడోసారి భూకంపంతో పసిఫిక్ తీరంలో సునామీ హెచ్చరికలు జారీచేశారు. ఆ తీరప్రాంతంలోని 300 కి.మీ. పరిధిలో ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. జూన్ నెలలో నేపాల్‌లో సంభవించిన భూకంపంతో ఉత్తర భారతంలోనూ భూప్రకంపలు నమోదయ్యాయి.
అలస్కాలో భూకంపాలు సాధారణమే అయినా, ఇటీవల సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపం ఇదే కావడంతో శాస్త్రవేత్తలు సమీక్షిస్తున్నారు. కాగా, అలస్కాపై 1964 మార్చిలో 9.2 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇప్పటి వరకూ ఉత్తర అమెరికాలో రికార్డయిన అతి శక్తివంతమైన భూకంపం ఇదే. ఈ భూకంపం కారణంగా సంభవించి సునామీ.. అలస్కాతో పాటు అమెరికా పశ్చిమ తీరం, హవాయిలలో పెను విధ్వంసం సృష్టించింది. నాటి సునామీ 250 మందికిపైగా పొట్టనబెట్టుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com