Tsunami: ఫిలిప్పీన్స్ లో సునామీ హెచ్చరికలు

Tsunami: ఫిలిప్పీన్స్ లో సునామీ హెచ్చరికలు
7.5 తీవ్రతతో భూకంపం...

శనివారం అర్ధరాత్రి ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిందానాలో రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ ఫివోల్క్స్ తెలిపింది. భూకంప కారణంగా దక్షిణ జపాన్ తీరానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. పిలిప్పీన్స్ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో అలలు 3 మీటర్ల ఎత్తునకు ఎగిసిపడే ప్రమాదం ఉందని అమెరికా సునామీ హెచ్చరికలు వ్యవస్థ అప్రమత్తం చేసింది.


గత నెలలో దక్షిణ ఫిలిప్పీన్స్‌లో వచ్చిన 6.7 తీవ్రత కల భూకంపం కారణంగా ఎనిమిది మంది చనిపోయారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా 7.5 తీవ్రతతో భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎంత జరిగిందన్నదీ ఇంకా తెలియరాలేదు. అంతలోనే సునామీ హెచ్చరికలు కూడా రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిలిప్పీన్స్‌, జపాన్‌ నైరుతి తీరాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్‌, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. భూకంప తీవ్రతను పరిశీలించిన ఫిలిప్పైన్‌ సిస్మాలజీ ఏజెన్సీ, యూఎస్‌ సునామీ వార్నింగ్‌ సిస్టమ్‌.. ఫిలిప్పీన్స్‌, జపాన్‌ నైరుతి తీరాల్లో సునామీ రానుందని.. మూడు మీటర్ల మేర అలలు ఎగసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశాయి. కాగా, ఈ రెండు దేశాల్లో సునామీ తలెత్తే అవకాశమున్న నివాస ప్రాంతాలను ఖాళీ చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.


భూకంపం వల్ల గణనీయమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఫివోల్క్స్ అంచనా వేసింది. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న తీరప్రాంత పట్టణం హినాటువాన్ స్థానిక పోలీసు చీఫ్ రేమార్క్ గెంటల్లాన్ మాట్లాడుతూ.. భూకంపం సంభవించినప్పటి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. విపత్తు ప్రతిస్పందన బృందాలు ఇంకా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టాన్ని పర్యవేక్షించలేదని చెప్పారు.


రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉన్న ఫిలిప్పీన్స్‌లో భూకంపాలు సర్వసాధారణం. ఇది భూకంప కార్యకలాపాలకు గురయ్యే పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ప్రదక్షిణ చేసే అగ్నిపర్వతాల బెల్ట్. 63 కి.మీ (39 మైళ్లు) లోతులో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం రాత్రి 10.37 గంటలకు భూకంపం సంభవించిందని, దీని తీవ్రత 7.6గా ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప కేంద్రం 32 కి.మీ (20 మైళ్లు) లోతులో ఉందని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story