Turkey: తమ్ముడిపై చిట్టితల్లి పట్టరాని ప్రేమ

Turkey: తమ్ముడిపై చిట్టితల్లి పట్టరాని ప్రేమ
భూకంపంలో శిధిలాల కింద తమ్ముడి సహా ఇరుకున్న ఏడేళ్ల చిన్నారి

ఆదివారం టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపంలో 7800 మంది మరణంచారు. వేలల్లో ప్రజలు గాయపడ్డారు. అక్కడ ఇంకా రెస్క్యూ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రెండు దేశాల్లోని హృదయ విదారక సన్నివేశాలు బయట పడుతున్నాయి. ఎక్కడి బిల్డింగ్‌లు అక్కడే కూలి వాటి శిదిలాల కింద ఎందరో ప్రాణాలు వదిలిన సంఘటనలు మనుషులందరినీ దు:ఖానికి గురి చేస్తున్నాయి. అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైర్‌లగా మారింది. ఆ ఫోటొను చూసిన వాళ్లు దేవుళ్లను మొక్కేస్తున్నారు. టర్కీలో ఏడేళ్ల చిన్నారి తన తమ్ముడు భూకంపం సమయంలో శిధిలాల మధ్య ఇరుక్కున్నారు. అంత క్లిష్ట పరిస్థితులలో కూడా తన తమ్ముడిని కాపాడేందుకు ఆ చిట్టితల్లి తీవ్ర పోరాటం చేసింది. తన చేతిని తమ్ముడి తలపై ఉంచి కాపాడుకోవడానికి దాదాపు 17 గంటల పాటు అలాగే ఉండిపోయింది. ఈ ఫోటొ ఇప్పడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుంది. ఈ చిత్రాన్ని చూసిన నెటిజన్లు అంతా ఆ చిట్టి తల్లికి తన తమ్ముడిపై ఉన్న ప్రేమను చూసి మంత్రముగ్థులవుతున్నారు. వారిద్దరికీ ఏమీ కావద్దని దేవున్ని ప్రార్ధిస్తున్నారు అమ్మాయిలు సహజంగానే రక్షకులు వారికి దేవుడు అంత గొప్ప లక్షణాన్ని పుట్టుకతోనే ఇచ్చాడు అంటూ కొందరు రాసుకొస్తున్నారు. అక్కగా తమ్ముడిని ప్రేమగా ఎలా చూసుకోవాలో అలాగే ఆ బంగారుతల్లి చేసిందని రాసేస్తున్నారు. ఈ ప్రకృతి వైపరిత్యం కారణంగా గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story