Turkey Earthquake : 'ఆపరేషన్ దోస్త్' పేరిట పీఎం మోదీ విలువైన సహాయం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టర్కీ, సిరియా భూకంపం బాధితులకు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ టర్కీకి చేస్తున్న తక్షణ సహాయాన్ని గుర్తు చేశారు. 'ఆపరేషన్ దోస్త్' కింద ప్రధాని మోదీ టర్కీకి వైద్యం, ఆహారం, రక్షణ సహాయాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికి ఆరు విమానాలతో కూడిన సహాయం టర్కీకి అందించినట్లు చెప్పారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), వైద్య బృందాలు, డాగ్ స్వ్కాడ్ ఆర్మీ విమానాలలో టర్కీ చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారికి తక్షణ వైద్యం అందేలా భారత బలగాలు సహాయం చేస్తున్నాయి.
IMF (International Monetary Fund) MD జార్జివా తో గురువారం వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు సీతారామన్. భారత దేశం వివిధ దేశాలకు చేస్తున్న సహాయాన్ని జార్జివా అభినందించారు. దక్షిణాసియాను బలోపేతం చేయడానికి భారత్ $50మిలియన్ల సహకారాన్ని కొనియాడారు. భారత్ సహాయం దక్షిణాసియా ప్రాంత సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.
టర్కీలో భారత రెస్క్యూటీం అందిస్తున్న వైద్య సదుపాయాల ఫోటోలను ట్వీట్ చేశారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్. సురక్షితమైన హాలులో వైద్యం అందించేందుకు రెడీగా గదులను ఏర్పాటు చేసింది భారత రెస్క్యూటీం. టర్కీలోని హటాయ్ లోని ఓ హాస్పిటల్ లో భారత్ కు చెందిన క్రిటికల్ స్పెషలిస్టులు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. 'ఆపరేషన్ దోస్త్' పేరుతో భారత్ అందిస్తున్న సహాయం టర్కీకి ఎంతో విలువైనదిగా తెలిపారు టర్కీ అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com