Turkey Earthquake: 4,500కు పైగా మృతి

Turkey Earthquake: 4,500కు పైగా మృతి
సోమవారం తెల్లవారుజామున సంభవించిన రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భూకంపం పెను విలయం సృష్టించింది. 24 గంటల వ్యవధిలో మూడు సార్లు భూకంపం వచ్చింది

టర్కీ, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇరు దేశాల్లో ఇప్పటి వరకు 4,500కు పైగా మృతిచెందారు. ఒక్క టర్కిలో 3వేలకు పైగా చనిపోగా.. సిరియాలో 1500 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పదివేలకుపైగా దాటవచ్చంటున్నారు. ఇప్పటికీ వందలాది మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. వేలల్లో ప్రజలకు గాయాలయ్యాయి. టర్కీలో దాదాపు 15వేలు, సిరియాలో 4వేల మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


సోమవారం తెల్లవారుజామున సంభవించిన రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భూకంపం పెను విలయం సృష్టించింది. 24 గంటల వ్యవధిలో మూడు సార్లు భూకంపం వచ్చింది. దీంతో వేలాది భవనాలు నేలమట్టం కాగా...అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. వేలాది సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులతో హాస్పిటళ్లు నిండిపోయాయి. ప్రస్తుతం శిథిలాల కింద ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. భూకంపం ధాటికి కహ్రమన్‌-మరాస్‌, గజియాన్‌టెప్‌ నగరాల్లో పెద్ద ఎత్తున భవనాలు కుప్ప కూలాయి. అడియమాన్‌, మలాత్యా, దియార్‌ బాకిర్‌ నగరాల్లోనూ బిల్డింగ్స్ నేలమట్టమయ్యాయి. మలాత్యాలో 13 శతాబ్ధం నాటి మసీదు పాక్షికంగా దెబ్బతింది. సిరియాలోని అలెప్పొ, లటకియా, హమా, టర్టాస్‌ పట్టణాల్లోనూ నష్టం ఎక్కువగానే ఉంది.


టర్కీ, సిరియాల్లోని రెండు దేశాల్లోనూ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. జనం ప్రాణ భయంతో ఆహాకారాలు చేస్తూ రోడ్లుమీద పరుగులు తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కాంక్రీటు కుప్పలు, ఇనుపచువ్వల కింద నలిగిపోయినవారి కోసం అన్వేషణ సాగించారు. కొన్నిచోట్ల శిథిలాల అడుగు నుంచి ప్రజలు ఆర్తనాదాలు చేయడం వినిపిస్తున్నాయి. క్షతగాత్రుల చేరికలతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. వారి ఆర్తనాధాలతో పరిస్థితులు దయనీయంగా కనిపించాయి. భూకంప కారణంగా రెండు దేశాల్లో వేలాది మరణించారు.




మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి వెళ్లిపోవడానికి జనమంతా ఒకేసారి ప్రయత్నించడంతో.. భారీఎత్తున ట్రాఫిక్‌ జామ్‌లు తలెత్తాయి. ఫలితంగా సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలను తరలించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ప్రయాణాలు చేయొద్దంటూ స్థానికులకు అధికారులు విన్నవించారు. ఓ వైపు ఇళ్లు కూలిపోవడం, మరోవైపు చలిలో బిక్కుబిక్కుమంటున్నారు జనం. భూకంపం కారణంగా గాజియాన్‌తెప్‌ నగరం నడిబొడ్డున కొండపై ఉన్న చారిత్రక కోట సహా అనేక పురాతన కట్టడాలు దెబ్బతిన్నాయి.




టర్కీ సిరియాలో భూకంపంపై స్పందించింది భారత్‌. మానవతా దృక్పథంతో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది.సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన డాగ్‌ స్క్వాడ్‌, అత్యవసర సామాగ్రి, పారామెడికల్ సిబ్బంది, మందులను ప్రత్యేక విమానంలో పంపింది.

Tags

Read MoreRead Less
Next Story