Turkey Earthquake : టర్కీ భూకంపంలో అప్పుడే పుట్టిన శిశువులను కాపాడిన నర్సులు

Turkey Earthquake : టర్కీ భూకంపంలో అప్పుడే పుట్టిన శిశువులను కాపాడిన నర్సులు
తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసీ, శిశువులు కిందపడకుండా ఇంక్యుబేటర్లను పట్టుకున్నారు

టర్కీ భూకంపం దాటికి 24వేల మంది మృతిచెందారు. భారత్ సహా మరిన్ని దేశాలు టర్కీ ప్రజలకు వైద్య, ఆహార సదుపాయాలను కల్పిస్తూ ఆదుకుంటున్నాయి. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఫిబ్రవరి 6న చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన ఓ వీడియో బయటకు వచ్చింది. అప్పుడే పుట్టిన శిశువులను నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు.

భూకంపం సంభవిస్తున్నప్పుడు హాస్పిటల్ పేకమేడలా ఊగిపోయింది. అలాంటి స్థితిలో అప్పుడే పుట్టిన పిల్లలు ఇంక్యుబేటర్ లో ఉన్నారు. భూకంపానికి హాస్పిటల్ ఊగుతుండగా ఆ గదిలోకి నర్సులు ప్రవేశించారు. తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసీ, శిశువులు కిందపడకుండా ఇంక్యుబేటర్లను పట్టుకున్నారు. ఏమాత్రం ఎక్కువగా భూమి కంపించినా ఆ బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉందని తెలిసినా నర్సులు తెగువ చూపించి పిల్లలను రక్షించారు. గజియాంటెప్ లోని ఓ హాస్పిటల్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృష్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు నర్సులను అభినందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story