Turkey Earthquake : చిన్నారికి WHO ప్రశంసలు

సిరియా భూకంపంలో 15వేలకు పైగా మృతిచెందారు. భూకంపం ధాటికి టర్కీ శవాల కుప్పగా మారింది. ఎటు చూసినా ఇళ్లు, కుటుంబ సభ్యులను కోల్పోయిన నిరాశ్రయులే కనిపిస్తున్నారు. ఐదు అంతస్థుల భవనాలు కుప్పకూలగా.. చాలా మంది మృతిచెందారు. శిథిలాల మధ్య ఇప్పటికీ కొందరు కొన ఊపిరితో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
శిథిలాలను తొలగించే క్రమంలో రెస్యూటీం చిన్నారులను కనుగొన్నారు. ఓ ఐదేళ్ల బాలిక తన రెండేళ్ల తమ్ముడిన రక్షించే క్రమంలో శిథిలాలలో చిక్కుకుంది. అప్పటికీ తన చేయిన అడ్డంగా పెట్టి తమ్ముడిని రక్షించుకుంది. చిన్నారి చూపిన ప్రేమకు ప్రపంచం అభినందనలు తెలుపుతోంది. ఇందులో భాగంగా WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘోబ్రెయెసస్ చిన్నారుల వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తే.. ధైర్యవంతురాలైన బాలికకు అంతులేని అభినందనలు తెలిపారు. 17 గంటల పాటు శిథిలాల కింద తమ్ముడిని రక్షించుకున్న ఘటన అందరినీ కట్టిపడేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com