Turkey Mass Grave: శ్మశానవాటికలు సరిపోవడంలేదు...

టర్కీలో శ్మశానవాటికలు నిండుకున్నాయి. ఇప్పటికే ఉన్న శ్మశానవాటికలన్నీ నిండిపోగా, ప్రభుత్వం కొత్త స్థలాలను సైతం కేటాయించింది. అయితే వాటికి మృతదేహాలతో కూడిన వాహనాలు బారులు తీరడంతో అది కూడా త్వరగా నిండిపోతోంది. దీంతో మృతదేహాలను ఖననం చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారంది. మారష్ నగరంలో స్మశానవాటికలన్నీ నిండిపోవడంతో ప్రభుత్వం కొత్త స్థలాన్ని కేటాయించింది. ఇక్కడ సుమారు 5వేల మంది టర్కీ భూకంప మృతులను ఖననం చేశారు. ఇక ఈ స్థలం కూడా త్వరగా నిండిపోతుండటంతో ఈ ప్రాంతాన్ని మరింత విస్తరించేందుకు అధికారులు అదేశాలు జారీ చేశారు. మృతదేహాలను ఖననం చేసేందుకు గుంతలు తవ్వేందుకు సహాయక బృందాలు నిర్వీరామంగా శ్రమిస్తూనే ఉన్నాయి. ఇక సామూహిక ఖననాలతో అధికారులు సైతం భావోద్వేగానికి లోనవుతున్నారు. 5లక్షల మంది జనాాభా ఉన్న మరాష్ నగరంలో పదివేల మంది భూకంప మృతులు ఉన్నారని వారు వాపోతున్నారు. ఇక సమాధుల వద్ద కేవలం నంబర్లు మాత్రమే ఉండటంతో బంధువులకు తమ వారిని గుర్తించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ల నాసిరకం కట్టడాల వల్లే ప్రాణనష్టం పెరిగిందని ప్రజలు వాపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com