Turkey Syria Earthquake: పెద్ద మనసున్న దేశీ గర్ల్...

Turkey Syria Earthquake: పెద్ద మనసున్న దేశీ గర్ల్...
టర్కీ భూకంపంపై ప్రియాంకా చోప్రా ట్వీట్; సహాయానికి ముందుకు రావాలని పిలుపు...

టర్కీ, సిరియాను కుదిపేసిన భూకంపం అంతర్జాతీయ సమాజాన్ని సైతం ధిగ్భ్రాంతికి గురిచేసింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. హృదయవిదారక దృశ్యాలతో సోషల్ మీడియా నిండిపోయింది. అక్కడి పరిస్థితులకు చలించని హృదయమంటూ లేదు. మిత్రదేశాలు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి సహాయ హస్తం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తమ వంతు సహాయాన్ని ప్రకటిస్తూ, అక్కడి బాధితులకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశీ గర్ల్ ప్రియాంకా చోప్రా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రకృతి ప్రకోపానికి ఎవరూ అతీతులు కారంటూ చెప్పుకొచ్చిన పీసీ, టర్కీ, సిరియాలో స్థానికంగా స్వచ్ఛంధ సేవలు అందిస్తోన్న సంస్థల పేర్లను ప్రస్తావించింది. ఇక ఈ పోస్ట్ కు ఓ వీడియోను జతచేసింది. సహాయక చర్యల్లో ఓ మూడు నెలల చిన్నారి ప్రాణాలతో బయటపడిన ఘటనను ప్రస్తావిస్తూ ఇలాంటి సందర్భాలే మనుషుల్లో తిరిగి ఆశను నింపుతాయని తెలిపింది. కానీ, ఇంకా ఎంతో మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారని, వారి కుటుంబాలు అద్బుతం జరిగి తమ వాళ్లు తిరిగివస్తారని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని తన పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇక పీసీ హృద్యమైన పోస్ట్ పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టర్కీ, సిరియా పై స్పందించిన అతి కొద్ది మంది సెలబ్రిటీల్లో ప్రియాంక ఒకరిగా నిలిచింది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు పీసీ ఎప్పుడూ ముందే ఉంటుంది. యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఇప్పటికే ఎన్నో సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంది.


Tags

Read MoreRead Less
Next Story