Turkey-Syria Earthquake: టర్కీ-సిరియా భూకంపం.. శిథిలాలలో జన్మించిన బిడ్డని దత్తత..

Turkey-Syria Earthquake: టర్కీ-సిరియా భూకంపం శిథిలాల మధ్య పుట్టిన 'మిరాకిల్ బేబీ'ని అత్త, మామలు దత్తత తీసుకుని కొత్త పేరు పెట్టారు. టర్కీ-సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువును దాదాపు రెండు వారాల తర్వాత ఆమె అత్త మామలు దత్తత తీసుకున్నారు. భూకంప ధాటికి చిన్నారి తల్లి, తండ్రి నలుగురు తోబుట్టువులు మరణించారు. కొన ఊపిరితో ఉన్న పాపాయిని రెస్క్కూ సిబ్బంది రక్షించగా అత్త మామలు చేరదీశారు.
పాప తల్లిదండ్రులు, తోబుట్టువులతో పాటు, వారు నివసిస్తున్న అపార్ట్‌మెంట్ బ్లాక్ కూడా ధ్వంసమైంది. భూకంపం సంభవించిన 10 గంటల తర్వాత సిబ్బంది 'మిరాకిల్ బేబీ'ని కనుగొన్నారు. రెస్క్కూ సిబ్బంది చిన్నారిని గుర్తించినప్పుడు తల్లితో అనుసంధానించబడి ఉన్న బొడ్డు తాడు అలానే ఉంది. దీనిని బట్టి తల్లి నిండు గర్భిణీ అని తెలిసింది. శిధిలాల మధ్యే బిడ్డను ప్రసవించి ప్రాణం కోల్పోయి ఉంటుందని అధికారులు భావించారు. బొడ్డు తాడు కూడా ఊడని చిన్నారి ప్రాణాలతో ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని గొల్పింది. దాంతో మిరాకిల్ బేబీగా వార్తలకు ఎక్కింది ఆ చిన్నారి.
బాలికకు ఆస్పత్రి సిబ్బంది అయా అని పేరు పెట్టారు - అరబిక్‌లో "దేవుని నుండి వచ్చిన సంకేతం" అని అర్థం, ఆసుపత్రి అధికారులు ఆమెను రక్షించిన తర్వాత అత్తమామలు దత్తత తీసుకున్నారు. ఆ పాపకు ఆమె తల్లి పేరు అఫ్రా అని నామకరణం చేశారు. సవాడి కార్లు కొని అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇప్పటికే నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయినా పుట్టుకతోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. పసిబిడ్డకు అమ్మానాన్నలయ్యారు. సవాడి మీడియాతో మాట్లాడుతూ.. అఫ్రాని నా సొంత బిడ్డ మాదిరిగానే చూసుకుంటాను. తేడా చూపించను. నా పిల్లలకంటే రవ్వంత ఎక్కువ ప్రేమనే చూపిస్తాను. ఎందుకంటే ఆమె తన తండ్రి, తల్లి, తోబుట్టువుల జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచుతుంది" అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com