Boycott Turkey: టర్కీతో సంబంధాలు లేవు.. భారత్ నిర్ణయంపై కోర్టుకెక్కిన సెలెబి..

Boycott Turkey: టర్కీతో సంబంధాలు లేవు.. భారత్ నిర్ణయంపై కోర్టుకెక్కిన సెలెబి..
X
తుర్కియే సంస్థపై వేటు.. ‘సెలెబి’ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు

‘‘ఆపరేషన్ సిందూర్‌‌’’ సమయంలో భారత్‌కి వ్యతిరేకంగా టర్కీ, పాకిస్తాన్‌కి సహకరించింది. టర్కీష్ డ్రోన్లను పాక్‌కి అందించింది. వీటిని దాయాది దేశం భారత్‌పైకి దాడిలో ఉపయోగించింది. ఇదే కాకుండా ఈ డ్రోన్లు ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా పాకిస్తాన్ పంపించినట్లు వార్తలు వస్తున్నా్యి. అయితే, ఈ నిర్ణయంపై భారత్ టర్కీపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బాయ్‌కాట్ టర్కీ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఆపిల్స్‌ని వ్యాపారులు బ్యాన్ చేశారు. టర్కీకి వెళ్లే టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

ఇదిలా ఉంటే, భారతదేశంలోని 9 ఎయిర్ పోర్టు్ల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీస్ ప్రొవైడర్‌గా సేవలు అందిస్తున్న టర్కీ విమానయాన సంస్థ అయిన సెలెబి కి భారత్ అనుమతుల్ని రద్దు చేసింది. “జాతీయ భద్రత దృష్ట్యా” భద్రతా అనుమతిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే, ఈ నిర్ణయంపై సెలెబి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేసింది. శుక్రవారం, సెలెబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ, అస్పష్టమైన జాతీయ భద్రతా సమస్యలను హేతుబద్ధంగా ఉదహరించారని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక తెలిపింది. కేంద్రం నిర్ణయాన్ని పక్కన పెట్టాలని కోరుతూ.. ఇది 3,791 ఉద్యోగాలను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుందని కంపెనీ వాదించింది. ఎలాంటి హెచ్చరిక లేకుండా ఈ ఉత్తర్వు జారీ చేయబడిందని కూడా పేర్కొంది.

గురువారం, కేంద్రం ప్రకటనకు స్పందించిన సెలెబీ, ‘‘తమది టర్కిష్ సంస్థ కాదని, ఏ విదేశీ ప్రభుత్వంతోనూ సంబంధాలు లేవని పేర్కొంది. సెలెబి వ్యాపారం నిజంగా భారతీయ సంస్థ అని, దీనిని భారతీయ నిపుణులు నడిపిస్తారని, మేము ఏ ప్రమాణాల ప్రకారం చూసినా టర్కిష్ సంస్థ కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించబడిన కార్పొరేట్ పాలన, పారదర్శకత, తటస్థత పద్ధతులకు కట్టుబడి ఉన్నాము. ఏ విదేశీ ప్రభుత్వం లేదా వ్యక్తులతో ఎలాంటి ఎలాంటి రాజకీయ అనుబంధాలు లేదా సంబంధాలు లేవు’’ అని ప్రకటనలో పేర్కొంది.

Tags

Next Story