Turkey Earthquake : భారత్ సహాయానికి టర్కీ ప్రజలు ఫిదా - గ్రౌండ్ రిపోర్ట్

టర్కీ భూకంపంలో ప్రాణాలతో బయటపడిన వారికి భారత సహాయం ఆశాకిరణమైంది. ఇండియన్ ఆర్మీ వైద్య బృందం అందిస్తున్న సేవలకు టర్కీ ప్రజల కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి. టర్కీలో ఇప్పటివరకు 17వేలకు పైగా చనిపోయినట్లుగా అక్కడి అధికారులు వెళ్లడించారు.
భూకంపంలో ప్రాణాలతో బయటపడిన వారి కష్టాలు హృదయవిదారకంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయి, ఉండటానికి ఇళ్ళు, తినడానికి తిండి లేక శిథిలాల కింద తలదాచుకుంటున్నారు. టర్కీ ప్రమాద తీవ్రతను గమనించిన భారత ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలకు పూనుకుంది. 6 విమానాల నిండా వైద్య, ఆహార, రక్షణ సేవలను అందిస్తుంది.
శీతాకాలం మధ్యలో భూకంపం సంభవించడంతో చలికి చిగురుటాకుల్లా వణుకుతున్నారు టర్కీ ప్రజలు. తాత్కాలిక టెంట్లను భారత ఆర్మీ నిర్మించింది. గాయపడిన వారికోసం స్పెషల్ గా పలు కుటీరాలను నిర్మించగా.. భారత ఆర్మీకి చెందిన డాక్టర్లు టర్కీ ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. భారత బృందం అందిస్తున్న సేవలకు టర్కీ ప్రజలు కన్నీరుపెట్టుకుంటున్నారు. ఆపదలో ఉన్నప్పుడు భారత్ చేస్తున్న సహాయం మరువలేనిదని.. ఓ భారత మహిళా ఆఫీసర్ ను టర్కీ మహిళ హత్తుకున్న ఫోట్ వైరల్ గా మారింది.
ఇండియన్ ఆర్మీ '60 పారాఫీల్డ్' పేరుతో తాత్కాలిక వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 30 పడకల ఫీల్డ్ హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది. గాయపడిన వారికి తక్షణమే వైద్యం అందిస్తుంది. సేవచేస్తున్న వారిలో... 14మంది డాక్టర్లు, 86మంది సిబ్బంది ఉన్నారు. సోమవారం నాటికి టర్కీ సిరియాలో కలిపి 21వేల 50మంది మృతిచెందారు. ఒక్క టర్కీలోనే 17వేల600మంది మరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com