అదృష్ట దేవత వరించింది.. 20 లాటరీ టికెట్లు ఒకేసారి..

అదృష్ట దేవత తలుపు తట్టకుండా ఏకంగా వచ్చి టోని ఇంట్లో కూర్చుండి పోయిందేమో.. అందుకే అతడు కొన్న 20 లాటరీ టికెట్లూ గెలుచుకున్నాడు.. ఒకటీ రెండూ కొంటే లక్కు మారదేమో.. లాటరీ తగలదేమో అని ఆలోచించి ఒకేసారి 20 టికెట్లు కొన్నాడు.. ఏదో ఒకటన్నా తగలదా.. తలరాత మారదా అని అనుకున్నాడు.. నిజంగానే లక్కు మారి అతడు కొన్న 20 లాటరీ టికెట్లూ గెలుచుకున్నాడు వర్జీనియాకు చెందిన టోనీ మైల్స్. టికెట్లు కొన్న నాలుగు రోజులకి లాటరీ అధికారులు విజేతలను ప్రకటించారు. 1-9-2-9 నెంబర్ల కాంబినేషన్ అతడు కొన్న 20 టికెట్లలో ఉండడంతో ఒక్కో టికెట్ కు 5 వేల డాలర్లు నగదు బహుమతి లభించింది. 20 టికెట్లకు గెలుచుకున్న మొత్తం దాదాపు రూ. 73.24 లక్షలు. ఒకేసారి అన్ని లాటరీ టికెట్లు గెలవడంతో నిజమా కలా అని ఆశ్చర్యపోయాడు. అంత డబ్బు ఒకేసారి రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆ నగదుతో మొదట తనకు ఉన్న అప్పులన్నీ తీర్చేస్తానని తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com