Twitter: తిరిగొచ్చిన ట్విట్టర్ పిట్ట.. సంతోషంలో కస్టమర్లు..

Twitter: తిరిగొచ్చిన ట్విట్టర్ పిట్ట.. సంతోషంలో కస్టమర్లు..
Twitter: ఎలాన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్-ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ప్రతి రోజు వార్తల్లో నిలుస్తున్నారు.

Twitter: ఎలాన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్-ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ప్రతి రోజు వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం, అతను అధికారిక ట్విట్టర్ లోగోను Dogecoin లోగోతో భర్తీ చేశారు. ఇది క్రిప్టోకరెన్సీ టోకెన్ సింబల్. అయితే లోగ్ మార్చడంపై చాలా చర్చలు జరిపిన తర్వాత, మస్క్ ఎట్టకేలకు బర్డ్ లోగోను తిరిగి ఆవిష్కరించారు. డోజీకాయిన్ పెట్టుబడిదారులు మస్క్‌పై వేసిన దావా కారణంగా ఈ చర్య జరిగిందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ ప్రారంభంలో ఈ మార్పు జరిగినందున, చాలా మంది ఈ చర్యను బిలియనీర్ మస్క్ చేసిన ఏప్రిల్ ఫూల్ వ్యవహారంగా భావించారు. ట్విట్టర్ లోగోకు సంబంధించి చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ, తిరిగి వచ్చిన చిన్న బర్డ్ కారణంగా వినియోగదారులు సంతోషంగా ఉన్నారు. ట్విట్టర్ పిట్ట మళ్లీ ఎగిరిపోకుండా ఉంటే బావుండనుకుంటున్నారు. చాలా మంది వినియోగదారులు డోజీ లోగో కొన్ని గంటలు మాత్రమే ఉంటుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో వినియోగదారులు ఆందోళన చెందారు. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో చాలా మంది వినియోగదారులు డోజీ లోగోను అవమానకరమైనదిగా భావించారు. ఏదిఏమైనా ట్విట్టర్ మళ్లీ తిరిగొచ్చినందుకు సంతోషిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story