Twitter Row: భారత్‌ను తాకిన ట్విట్టర్ హీట్.. 'కూ' అకౌంట్ కు కళ్లెం.

వాషింగ్టన్
Twitter Row: భారత్‌ను తాకిన ట్విట్టర్ హీట్.. కూ అకౌంట్ కు కళ్లెం.
Twitter Row: ఎలాన్ మస్క్ ఆగ్రహానికి గురైన ఇండియన్ యాప్. కూ అకౌంట్ ను సస్పెండ్. ఎలాన్ తిక్కకు అడ్డే లేకుండా పోతోందంటోన్న కూ కో-ఫౌండర్ మయాంక్.

Twitter Row: తన దారికి ఎవరు అడ్డు వచ్చినా, తాను ఎవరకు అడ్డు వెళ్లినా వారికే నష్టం అన్న చందాన చెలరేగిపోతున్నాడు బిలియనీర్ ఎలాన్ మస్క్. సుప్రసిద్ధ పాత్రికేయుల అకౌంట్‌లను సస్పెండ్ చేస్తూ తన ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా భారత్ మైక్రో బ్లాగింగ్ సైట్ 'కూ' అకౌంట్ ను నిలిపివేసి ఇక్కడివారికీ చురకలు అంటించే ప్రయత్నం చేస్తున్నాడు.



తన గురించి వ్యతిరేకంగా రాస్తున్న ప్రముఖ జర్నలిస్టుల అకౌంట్ లపై వేటు వేస్తున్న మస్క్, ఇందులో భాగంగానే కూ అధికారిక అకౌంట్ ' కో-ఎమినెన్స్' (@kooeminence) సేవలు నిలిపివేశాడు. ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా భారత్ లో సేవలు అందిస్తోన్న ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ క్రమంగా యూజర్ బేస్ ను పెంచుకుంటోంది. ఈ తరుణంల ో కూ ట్విట్టర్ అకౌంట్ ను నిలిపివేయడంపై ఆ సంస్థ కో-ఫౌండర్ అయిన మయాంక్ బిడావట్కా ఘాటుగానే స్పందించారు.



ఇది ఇక్కడితో ఆగిపోలేదు ఇంకా ఉంది అంటూ పేర్కొన్న మయాంక్, తొలుత 'మాస్టోడాన్' వంటి మైక్రో బ్లాగింగ్ అంకౌంట్లను నిలిపివేశాడని, ఇప్పుడు అతడి దృష్టి 'కూ' మీద పడిందని వ్యాఖ్యానించారు. ఇతనికి ఇంకా ఎంత అధిపత్యం కావాలి అంటూ వాపోయారు. అక్కడితో ఆగని మయాంక్ ట్విట్టర్ బాస్ కు కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.



అన్ని మాధ్యమాల్లోనూ అందుబాటులో ఉన్న సమాచారాన్ని తమ అకౌంట్లలో షేర్ చేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇది డాక్సింగ్ కిందకు రాదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం, తనకు అనుకూలంగా పాలసీలను మార్చేయడం, రోజుకో విధమైన ఎజెండాను ప్రతిపాదించడం ఎంతవరకూ సమంజసమని అడిగారు. ట్విట్టర్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతోందని, దీనిపై మాట్లాడాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.



'కూ' ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా నాణ్యమైన, ఉన్నతమైన సేవలు అందించడం సహించలేకనే ఎలాన్ మస్క్ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నాడని ఘాటుగా విమర్శించారు మయాంక్. అతని ఈగోకు వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


Tags

Read MoreRead Less
Next Story