Twitter Row: ట్విట్టర్ లో ఉద్యోగావకాశం! బుర్రలేనివారికే ఓటు అంటోన్న మస్క్

Twitter Row: తాను ట్విట్టర్ సీఈఓగా కొనసాగాలా వద్దా అంటూ ఎలాన్ మస్క్ నిర్వహించిన పోలింగ్ లో అనుకున్నట్లుగానే జనాలు అతడికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఓటమిని అంగీకరించని మస్క్ అది యాప్ లోని బోట్ లోపం అంటూ ఫలితాల్ని తిరస్కరించాడు. ఇక తన స్టైల్ లో మరో ట్వీట్ చేసిన మస్క్ తన మార్క్ చమక్కులు విసిరాడు.
ట్విట్టర్ సీఈవోగా ఉద్యోగావకాశం ఉందంటూ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరచిన మస్క్, బుర్ర తక్కువవారికి మాత్రమే ఈ అవకాశం అంటూ తన మార్క్ ఛలోక్తులను కూడా వెనుక తగిలించాడు. అలా తనకు ఎవరైనా తారసపడితే ట్విట్టర్ సీఈఓగా తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించాడు. ఆ తరువాత తాను సాఫ్ట్ వేర్, సర్వర్స్ బృందాలకు మాత్రమే నాయకత్వం వహిస్తానని తెలిపాడు.
గతంలోనూ మస్క్ పలుసార్లు తానూ ఏ సంస్థకూ సీఈఓగా ఉండాలనుకోవడంలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెస్లా సంస్థకు కూడా ఇంకో సీఈఓ ను వెతికే పనిలోపడ్డాడు. ఇక మరోసారి పోలింగ్ నిర్వహిస్తానని ప్రకటించిన మస్క్, ఈ సారి బ్లూ టిక్ ఉన్నవారు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులని తేల్చేశాడు. ఏమైనా మన తుగ్లక్ బాస్ నెక్స్ట్ ఏం చేస్తాడో ఏమోనని నెటిజన్లు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com