భరతనాట్యం.. హిప్ హప్ మిక్స్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

కళల కాణాచి భారత్.. భరతనాట్యం, కూచిపూడి కళలను విశ్వవాప్తం చేసిన ఘనత భారత్‌కు దక్కుతుంది. భరతనాట్యంపై మక్కువ పెంచుకుంది ఆంగ్లో ఇండియన్ కళాకారిణి ఉషా జే. ఆమె హిప్ హాప్‌లో ఫేమస్. అయితే ఈ రెంటినీ కలిపి మిక్స్ చేసి డ్యాన్స్ చేయాలని తలపోసింది ఉషా. ఆమె ఫ్రెండ్ ఓర్లేన్‌తో కలిసి గజ్జ కట్టింది.. కాలు కదిపింది. వీరు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా ఉషా రూపొందించిన ఈ డ్యాన్స్ స్టెప్స్ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్‌లో ఈ వీడియోలను పోస్టు చేస్తున్న ఉషా జే వీటికి హైబ్రిడ్ భారతం అని పేరు పెట్టారు. భరతనాట్యం పట్ల తనకు ఎనలేని ప్రేమ ఉందని, అయితే తానేమీ భరతనాట్య నిపుణురాలిని కాదని ఆమె అన్నారు. ఆ ఇష్టంతోనే ఈ వీడియోని రూపొందించానని అన్నారు.
View this post on InstagramThis week on crossovers nobody asked for but everybody deserves - Hip Hop X Bharatham
A post shared by YouTube India (@youtubeindia) on
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com