Dubai floods: దుబాయిలో భారీ వర్షాలు

ఎడారి దేశం యూఏఈలో భారీ వర్షాల కురుస్తున్నాయి. వర్షాల ధాటికి దుబాయ్‌లోని రహదారులు నదులను తలపించాయి. దుబాయ్ సంవత్సర సగటు వర్షపాతం 120 మిల్లిమీటర్లు కాగా కేవలం ఆరు గంటల్లోనే 50 మిల్లమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. వరద లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆకాశాన్ని మేఘాలు కమ్మేసి వర్షం కువడంతో ఎప్పుడు రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానశ్రయం విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభత్వం సహాయక చర్యలను చేపట్టింది. ఈ వర్షాలపై ఒక రోజు ముందే ప్రజలను హెచ్చరించింది.
వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు బీచ్‌లకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు దుబాయ్ పోలీసులు నివాసితులకు ఎట్టి పరిస్థితుల్లోను ఇళ్లు వదిలి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దుబాయ్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కూలిన చెట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారిలోని కొన్ని మార్గాలను దుబాయ్ అధికారులు మూసేశారు.
దుబాయిలో భారీ వర్షాలు, వరదలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ఒక్క సారిగా ముంచెత్తిన వాన ధాటికి రహదారులు కాలువలుగా మారాయి. భారీ ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా, దుబాయి నగరంపై అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుని కుంభ వృష్టిగా వర్షం కురిసి నగరాన్ని జలమయం చేసింది. దుబాయి సహా యూఏఈ వ్యాప్తంగా భారీగా వడగండ్ల వానలు కురుస్తున్నాయి. పరిస్థితులు సాధారణం అయ్యే వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. యూఏఈలో జాతీయ వాతావరణ శాఖ (ఎన్సీఎం) కూడా రెడ్ అండ్ అంబర్ అలర్ట్ జారీ చేసింది. అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పు యూఏఈ వాసులను భయభ్రాంతులకు గురిచేసింది. అబుదాబి, దుబాయ్, రస్ అల్ ఖైమా, ఫుజైరా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. రస్ అల్ ఖైమా, ఫుజైరాలోని కొన్ని ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో రహదారులు జలమయమై, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com