Pakistan Terrorist: పాకిస్తాన్‌లో మరో ఉగ్రవాది హత్య

లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అనుచరుడిని గుర్తు తెలియని కాల్చిచంపారు. కరాచీలో డిసెంబరు 2వ తేదీ అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సయీద్ అనుచరుడు హంజ్లా అద్నన్ తన ఇంటి బయట ఉండగా.. కొందరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది . ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అద్నన్‌ను పాక్ ఆర్మీ రహస్యంగా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపింది. అక్కడ చికిత్స పొందుతూ అద్నన్ మంగళవారం చనిపోయినట్లు వెల్లడిచింది. 2015, 2016లో జమ్మూకశ్మీర్‌లోని ఉదంపుర్, పాంపోర్‌లో భద్రతా దళాల కాన్వాయ్‌లపై జరిగిన ఉగ్రదాడిలో అద్నన్ కీలక సూత్రధారి. ప్రస్తుతం ఈ ఘటనలపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది.
భారత్‌లో పలువురు సైనికులు, ప్రజల ప్రాణాలను బలిగొన్న రెండు ఉగ్రదాడుల్లో సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సహ్నితుడైన ఉగ్రవాది అద్నాన్ అహ్మద్ హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని కరాచీలో ఈనెల 2న గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరపగా చికిత్స పొందుతూ 5వ తేదీన చనిపోయాడు. అద్నాన్ అహ్మద్ అలియాస్ హంజలా అద్నాన్.. భారత్‌లో 2015లో ఉధంపూర్‌లో, 2016లో పంపోర్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో సూత్రధారిగా వ్యవహరించాడు. ఉధంపూర్‌లో బీఎ్‌సఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, పంపోర్‌లో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 8 మంది సైనికులతో పాటు మరో 22 మంది చనిపోయారు. శ్రీనగర్, పుల్వామా ఆత్మాహుతి దాడుల్లోనూ అద్నాన్ కీలక పాత్ర పోషించాడు. పాక్‌లో గత కొన్ని నెలలుగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com