17 Nov 2021 9:00 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / Uganda news: ఉగాండాలో...

Uganda news: ఉగాండాలో భారీ బాంబు బ్లాస్ట్.. ఎవరిని టార్గెట్ చేస్తూ..?

Uganda news: ఉగాండా రాజధాని కంపాలా వరుస పేలుళ్లతో అట్టుడికింది.

Uganda News (tv5news.in)
X

Uganda News (tv5news.in)

Uganda News: ఉగాండా రాజధాని కంపాలా వరుస పేలుళ్లతో అట్టుడికింది. భారత పారా బ్యాడ్మింటన్ టీమ్ బస చేసిన హోటల్‌కు వంద మీటర్ల దూరంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 24 మంది గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కంపాలా పోలీసులు తెలిపారు.

అయితే పేలుళ్ల నుంచి భారత జట్టు తృటిలో తప్పించుకుందని.. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టంచేశారు. కాగా.. ఉగాండా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్-2021లో పాల్గొనేందుకు భారత పారా బ్యాడ్మింటన్ జట్టు ఇటీవల ఉగాండా వెళ్లింది. ఈ బీభత్సం వెనుక గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని ఉగాండా సైనిక ప్రతినిధి తెలిపారు.

Next Story