UK: బ్రిటన్ ప్రధానికి జరిమానా....

UK: బ్రిటన్ ప్రధానికి జరిమానా....
X
సీటు బెల్ట్ వేసుకోని బ్రిటన్ ప్రధాని రిషీ సౌనక్; ఫైన్ విధించిన అధికారులు...

బిటన్ ప్రధాని రిషీ సౌనక్ కు ఫైన్ పడింది. సాధారణ పౌరుడి మాదిరే ఆయన తాను చేసిన తప్పిదానికి ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పి జరిమానా కట్టేందుకు సిద్ధమయ్యారు.


కదులుతున్న కారులో వీడియో చేస్తూ సీటు బెల్ట్ లేకుండా ప్రయాణిస్తూ కనిపించిన రిషీకి జరిమానా విధిస్తూ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో ప్రధాని రిషీ సైతం తాను చేసిన పనికి క్షమాపణలు కోరారు. చట్టానికి ఎవరూ అతీతులు కారంటూ జరిమానా రుసుమును చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు.


అయితే రిషీ సౌనక్ వ్యవహారం భారతీయులకు కనివిప్పుగా మారాల్సిన సమయం ఆసన్నమైందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని సంగతి పక్కన పెడితే... చోటా మోటా రాజకీయ నేతలు సైతం ఇష్టరీతిన నిబంధనలను ఉల్లంఘించేందుకు వెనుకాడరు. రాజకీయ కండువా కప్పుకుంటే చాలు పోలీసులు, ప్రభుత్వ అధికారులు తమ అత్తగారిల్లు అయిపోయినట్లు హుకుం చాలాయిస్తారు.


ఇక బడా రాజకీయ నేతలు రోడ్డెక్కారు అంటే ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయే మన దేశంలో ఒక్కరిపై అయినా నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు ఫైల్ అయిన దాఖలాలు లేవు. మరి రిషీ సౌనక్ ఘటనతోనైనా మనోళ్లలో కాస్తైనా మార్పు వస్తుందేమో చూడాలి.








Tags

Next Story