UK : రెండో ప్రపంచ యుద్దం నాటి బాంబు పేలింది

UK : రెండో ప్రపంచ యుద్దం నాటి బాంబు పేలింది
'గ్రేటర్ యార్ మౌత్' లో బాంబును గుర్తించారు బ్రిటిష్ అధికారులు. బాంబును డిప్యూజ్ చేస్తుండగా పేలుడు సంభవించింది


రెండో ప్రపంచ యుద్దం నాటి బాంబు పేలింది. ఈ ఘటన యూకే లో జరిగింది. 'గ్రేటర్ యార్ మౌత్' లో రెండో ప్రపంచ యుద్దంనాటి బాంబును గుర్తించారు బ్రిటిష్ అధికారులు. బాంబును డిప్యూజ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. నిర్వీర్యం చేయడానికి రోబోలను ఉపయోగించినట్లు తెలిపారు. బాంబు డిఫ్యూజ్ చేసేందుకు ముందు స్థానికంగా ఉన్న ఇళ్లు, కార్యాలయాలను ఖాళీ చేయించారు. ఢిప్యూజ్ చేసే క్రమంలో బాంబు పేలింది. ఈ ఘటనను వీడియో లో రికార్డ్ చేశారు.

2017లో గ్రీస్ దేశంలో రెండవ ప్రపంచయుద్దంనాటి పేలని 500పౌండ్ల బాంబును కనుగొన్నారు. ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు 75వేల మందిని ఖాళీ చేయించారు. ఇది ఉత్తర గ్రీకు నగరమైన 'థెస్సలోనికీ' గ్యాస్ స్టేషన్ కింద కనుగున్నట్లు అధికారులు తెలిపారు. 2020లో పోలాండ్ లో కూడా రెండవ ప్రపంచ యుద్దం నాటి బాంబును కనుగొనగా నిర్వీర్యం చేసే క్రమంలో అది పేలిపోయింది. ఈనాటికీ పేలని బాంబులు లెక్కలేనన్ని ఉన్నట్లు యూకే అధికారులు అభిప్రాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story