UK: టమాటాలు ప్రియం.... సాస్ లేని పిజ్జాలతో సరిపెట్టుకుంటోన్న వైనం...

UK: టమాటాలు ప్రియం.... సాస్ లేని పిజ్జాలతో సరిపెట్టుకుంటోన్న వైనం...
బ్రిటన్ లో అత్యంత ప్రియంగా మారిన టమాటాలు; దిగుమతి గణనీయంగా పడిపోవడంతో రెండింతలు పెరిగిన టమాటా రేట్; సాస్ లేని పిజాలతో సరిపెట్టుకుంటోన్న జనాలు...

బ్రిటన్ లో టమాటాలకు ఎన్నడూ లేనంత కొరత నెలకొంది. దిగుబడి గణనీయంగా పడిపోవడంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ టమాటాలకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాయి. ఇక బ్రిటన్ల అత్యంత ప్రియమైన ఆహారం పిజ్జాకు కూడా ఈ కొరత తాకిడి గట్టిగానే తగిలింది. టమాటా సాస్, టాపింగ్స్ లేనిదే పిజ్జాకు ఆ రుచి రాదన్నది వాస్తవమే. ముఖ్యంగా అక్కడి వారికి అది ఆరో ప్రాణం కిందే లెక్క. అలాంటిది పిజ్జా సెంటర్లన్నీ మూకుమ్మడిగా టామాటో లెస్ పిజ్జాలు చేయాలని సంకల్పంచడంతో పిజా లవర్స్ ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఎక్కడ నుంచి టమాటాలు వచ్చే దిక్కు లేకపోవడంతో రెస్టారెంట్లు వైట్ పీజా, పాస్తాలతో సరిపెట్టేస్తున్నాయి. కొందరు ఏకంగా టమాటా తప్పని సరి అయిన వంటకాలను తమ మెనూ నుంచి డిలీట్ చేస్తున్నాయి.

అసలు బ్రిటన్ లో టమాటాలకు కొరత ఏర్పడటానికి చాలానే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక్క చలికాలంలోనే స్పెయిన్, నార్త్ ఆఫ్రికా నుంచి 95 శాతం టమాటాలను దిగుబడి చేసుకుంటుంది. అయితే దక్షిణ స్పెయిన్ లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడంతో అక్కడ దిగుబడి తీవ్రంగా దెబ్బతిన్నాది. మొరాకోలో వరదల తాకిడికి పంట మొత్తం నష్టపోయంది. ఇక రవాణా వ్యవస్థలోని లోపాల కారణంగా సరుకు రవాణాలోనూ అవాంతరాలు ఏర్పాడ్డాయి. ఇక ద్రవ్యోల్బణం, లాజిస్టిక్ సమస్యలు, బ్రెక్సిట్ కూడా బ్రిటన్ లో టమాట కొరతకు కారణమని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story