వాకింగ్ చేస్తూ గుండెపోటుకు గురైన సీఈఓ.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్

వాకింగ్ చేస్తూ గుండెపోటుకు గురైన సీఈఓ.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్, కార్డియాక్ ఎక్సర్ సైజులు చేయాలని చెబుతుంటారు వైద్యులు.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్, కార్డియాక్ ఎక్సర్ సైజులు చేయాలని చెబుతుంటారు వైద్యులు. వ్యాయామాలు చేస్తున్నప్పుడే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారిని తరచుగా చూస్తున్నాము. గుండె పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అలెర్ట్ చేస్తున్నాయి ఆపిల్ స్మార్ట్ వాచ్ లు. దీంతో చావు అంచులదాకా వెళ్లొచ్చిన వాళ్లు కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది తమ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. తమ లైఫ్ స్పాన్ ని పెంచుకుంటున్నారు.

UK కంపెనీ CEO నడుస్తున్నప్పుడు గుండెపోటుకు గురవడంతో స్మార్ట్‌వాచ్ అతని ప్రాణాన్ని కాపాడింది. హాకీ వేల్స్ కంపెనీకి CEO అయిన పాల్ వాపమ్ (42) తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి అతని ఛాతీలో తీవ్రమైన నొప్పి అనిపించింది.

తాను పెట్టుకున్న స్మార్ట్ వాచ్ ద్వారా తన భార్యను సంప్రదించగలిగాడు, ఆమె అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. చికిత్స అనంతరం వేల్స్ మాట్లాడుతూ , '' ఉదయం 7 గంటలకు వాకింగ్ కి వెళ్ళాను, ఐదు నిమిషాల్లో నాకు ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చింది.

''నా ఛాతీ బిగుతుగా అనిపించింది, ఆపై నేను రోడ్డు మీద మోకాళ్లపై కూర్చున్నాను. గుండె పిండేసినట్లు అవుతోంది. ఇది కచ్చితంగా గుండె నొప్పే అని నాకు అనిపించింది. నేను నా భార్య లారాకు ఫోన్ చేయడానికి నా వాచ్‌ని ఉపయోగించగలిగాను. అదృష్టవశాత్తూ, నేను ఇంటికి కేవలం ఐదు నిమిషాల దూరంలో ఉన్నాను. నా భార్య వెంటనే పారామెడిక్స్ ని పిలిచింది.

అతడికి చికిత్స అందించిన వైద్యులు ధమనులలో ఒకదానిలో పూర్తిగా బ్లాకేజెస్ ఉండడం వల్ల అతనికి గుండెపోటు వచ్చినట్లు కనుగొన్నారు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రి కార్డియాక్ సెంటర్‌లోని కాథెటరైజేషన్ లేబొరేటరీకి తీసుకువెళ్లి చికిత్స అందించారు. అతను ఆరు రోజులు కరోనరీ యూనిట్‌లో ఉండి పూర్తిగా కోలుకున్న తరువాత ఇంటికి వెళ్లాడు.

''నేను అధిక బరువుతో లేను, నన్ను నేను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రతి రోజు వ్యాయామం చేస్తుంటాను. కాబట్టి నాకు ఎటువంటి ప్రమాద కారకాలు లేవని భావించాను. ఇలా జరగడం కొంచెం షాక్‌గా ఉంది. ఇది నిజంగా నా కుటుంబంతో సహా అందరినీ షాక్‌కి గురి చేసింది అని తెలిపారు. తన భార్యకు ఆసుపత్రి సిబ్బందికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

స్మార్ట్‌వాచ్‌లు చాలా సందర్భాలలో జీవిత రక్షకునిగా నిరూపించబడ్డాయి. హృదయ స్పందన రేటు, ECG మరియు మరిన్నింటిని కొలిచే సెన్సార్‌లను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల ఆరోగ్యంలో అసాధారణతలను గుర్తించి వారిని అలెర్ట్ చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story