Italy: ఇటలీలో తీవ్ర విషాదం

ఇటలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిసిలీ తీరంలో విలాసవంతమైన సూపర్‌యాచ్ మునిగిపోవడంతో బ్రిటిష్ మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్ లించ్ అదృశ్యమయ్యాడు. మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు బ్రిటిషర్లు కాగా.. ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఒకరి మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. ప్రమాదం నుంచి లించ్ భార్యతో పాటు మరో 14 మంది బయటపడ్డారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
1996లో మైక్ లించ్( 59) సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించారు. మూడు నెలల కిందటే అమెరికాలో ఓ మోసం కేసులో నిర్దోషిగా బయటపడ్డాడు. సిసిలీలో తీవ్ర తుపాను కారణంగా ఈ విలాసవంతమైన నౌక మునిగిపోయింది. సిసిలియన్ పోర్టు నుంచి ఆగస్టు 14న ఈ సూపర్‌యాచ్ బయలుదేరింది. ఆదివారం ఇందులో 10 మంది సిబ్బంది 12 మంది ప్యాసింజర్లు ఉన్నారు. పోర్టిసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా నౌక మునిగిపోయినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com