అంతర్జాతీయం

యూకేలో ఓమిక్రాన్ విశ్వరూపం.. ఒక్కరోజులోనే 78, 610 మందికి పాజిటివ్‌

UK Corona : బ్రిటన్‌ను కరోనా కలవరపెడుతోంది. బుధవారం ఒక్కరోజే ఆ దేశంలో 78 వేల 610 మంది కరోనా బారిన పడ్డారు.

యూకేలో ఓమిక్రాన్ విశ్వరూపం.. ఒక్కరోజులోనే 78, 610 మందికి పాజిటివ్‌
X

UK Corona : బ్రిటన్‌ను కరోనా కలవరపెడుతోంది. బుధవారం ఒక్కరోజే ఆ దేశంలో 78 వేల 610 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా సంక్షోభం మొదలయ్యాక ఇప్పటివరకూ బ్రిటన్‌లో ఒక్క రోజు నమోదైన కేసుల పరంగా ఇదే అత్యధికం. గత జనవరిలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు కాగా..బుధవారం అంతకంటే పది వేల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. బ్రిటన్‌ మొత్తం జనాభా 67 మిలియన్లు కాగా.. ఇప్పటివరకూ 11 మిలియన్ల మంది కరోనా బారినపడ్డారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కూడా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ సోకిన ఓ వ్యక్తి చనిపోయారు.

ఒమిక్రాన్ రూపంలో మరో వేవ్‌ విజృంభణ మొదలైందని, జాగ్రత్తగా ఉండాల్సిందేనంటూ UK ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్‌ ఇప్పటికే హెచ్చరించారు. క్రిస్‌మస్ వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని నెల రోజుల క్రితమే సూచించినా జనం పట్టించుకోలేదు. ఫలితంగా దేశంలో కనీసం కోటి పదిలక్షలమందికి కరోనా సోకింది. యూకే మొత్తం జనాభాలో ఐదోవంతుకు కోవిడ్‌ సోకడంతో పరిస్థితులు ఏ క్షణాన ఎలా మారతాయోననే టెన్షన్ కనిపిస్తోంది.

ఇప్పటికే బ్రిటన్‌లో రెండు-మూడు లాక్‌డౌన్లు పెడటం ఆర్థిక వ్యవస్థతపై ప్రభావం చూపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ బోరిస్ జాన్సన్ ఆంక్షలు విధించడానికి తయారైనా, చట్టసభల్లోని ప్రతినిధులే ఆయనకి ఎదురు తిరుగుతున్నారు. దాదాపు వందమంది పార్లమెంట్ మెంబర్లు ఆయనకి వ్యతిరేకంగా ఓటింగ్ చేసారు. మరోవైపు విజృంభిస్తున్న వైరస్ చాలా వేగంగా, రెట్టింపు శక్తితో వ్యాపిస్తోందని, రెండు రోజుల్లోనే తన బలాన్ని విపరీతంగా పెంచుకుంటుందని స్థానిక కేసుల సంఖ్యని బట్టి అంచనా వేస్తున్నారు.

Next Story

RELATED STORIES