Ukraine: మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డ రష్యా; ఒకేసారి వంద మిసైళ్ల ప్రయోగం

Ukraine
Ukraine: మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డ రష్యా; ఒకేసారి వంద మిసైళ్ల ప్రయోగం
మిసైళ్లతో మోతెక్కిపోయిన ఉక్రెయిన్; రష్యా మూకుమ్మడి దాడిలో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలు

Ukraine: మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డ రష్యా; ఒకేసారి వంద మిసైళ్ల ప్రయోగం


అంతర్జాతీయ సమాజం నుంచి క్రమంగా మద్దతు కూడగట్టుకుంటోన్న ఉక్రెయిన్ మరోసారి మిసైళ్లతో మోతెక్కిపోయింది. సుమారు వంద మిసైళ్లను ఎక్కుపెట్టిన రష్యా మూకుమ్మడి దాడిలో ఉక్రెయిన్ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ దాడిలో దేశ రాజధాని కైయివ్ సహా పలు నగరాలు అట్టుడిగిపోతున్నాయి.


సుమారు వంద మిసైళ్లు, తెరలుతెరలుగా దూసుకువచ్చాయని ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ అడ్వైజర్ ఒలెస్కీ ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. కయివ్, జితోమిర్, ఒదేశా లో పేలుళ్లు సంభవించాయని తెలుస్తోంది. ఈ మేరకు పలు నగరాల్లో విద్యుత్తుని నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


ఓ వైపు జెలెన్స్కీ పది పాయంట్ల ఎజెండాతో రష్యాతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతుండగా ఈ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ పౌరులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి అన్న వార్తల్ల ోనిజంలేదని రష్యా వాదిస్తోంది. కానీ, వరుస దాడుల్లో ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలు, పట్టణాలు నేలమట్టమవుతున్నాయి. బుధవారం జరిగన దాడుల్లో ఉక్రయెన్ లోని ఖేర్సన్ ఆసుపత్రిలోని మెటర్నరీ వింగ్ పూర్తిగా ధ్వంసం అవ్వగా స్టాఫ్ ను, రోగులను హుటాహుటిన తాత్కాలిక శిబిరాలకు తరలించింది.


Tags

Read MoreRead Less
Next Story