Ukraine: యుద్ధభూమిలో జో బైడైన్....

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై నేటి ఏడాది గడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు మద్ధతు తెలిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా యుద్ధభూమికి పయనమయ్యారు. కీవ్ లో దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని మర్యాదపూర్వకంగా కలిసిన బైడెన్ తన ఆకస్మిక పర్యటనతో ఆ దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఉక్రెయిన్ పై రష్యా క్రూరమైన చొరబాటుకు ఏడాది పూర్తి కావొస్తుండటంతో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని కలసి దేశ ప్రజలకు తమ పూర్తి మద్దుతు ప్రకటిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రజాస్వామ్యానికి, సార్వభౌమత్వానికి, సమగ్రతకు తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. మరో వైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా దీనిపై ట్వీట్ చేశారు. యుద్ధ వార్షికోత్సవం పురస్కరించుకుని జో బైడెన్ ప్రస్తుతం కీవ్ లో ఉన్నారని, దీన్ని బట్టీ రష్యా తప్పకుండా ఓడిపోతోందని అర్దమవుతోందని ట్వీట్ చేశారు. పుతిన్, అతడి సైన్యం అసలిపోతుందని, ఉక్రెయిన్ తనకు కావాల్సిన ఆయుధాలను సమకూర్చుకుంటోందని, ఇకపై తగ్గేదేలేదంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com