Ukraine: పుతిన్ మరో హిట్లర్! అమెరికా కాంగ్రెస్ లో జెలెన్స్కీ ఘాటు స్పీచ్

Ukraine: పుతిన్ మరో హిట్లర్! అమెరికా కాంగ్రెస్ లో జెలెన్స్కీ ఘాటు స్పీచ్
అమెరికా కాంగ్రెస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడికి గౌరవ ఆహ్వానం; మీరు చేస్తోంది ఛారిటీ కాదు గ్లోబల్ సెక్యూరిటీపై పెట్టుబడి అంటూ వ్యాఖ్య

Ukraine: రష్యాతో యుద్ధాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ఉక్రెయిన్ వీరుడిగా పేరుగడించిన ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా ఆహ్వానం మేరకు అక్కడి అసెంబ్లీకి హాజరైన ఆయనకు కాంగ్రెస్ నుంచి ఘన స్వాగతం లభించింది. స్టాండింగ్ ఓవేషన్ తో జెలెన్స్కీని ఆహ్వానించింది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ పై నిప్పులు చెరిగారు.


ఖాకీ షర్ట్ అండ్ ట్రౌజర్స్ లో చాలా కూల్ గా కనిపించిన జెలెన్స్కీ మరోవైపు చాలా కాన్ఫిడెంట్ గా తన స్పీచ్ ను అదరగొట్టేశాడనే చెప్పాలి. 1944లో సరిగ్గా క్రిస్మస్ సమయంలోనే ధైర్యవంతులైన అమెరికా సైనికులు ప్రాణాలకు తెగించి హిట్లర్ దళాలను తరిమికొట్టినట్లే ఇప్పుడు ఉక్రెయిన్ సైనికులు కూడా అదే పని చేస్తున్నారని అమెరికా చరిత్రను కొనియాడుతూ తన స్పీచ్ ను ప్రారంభించిన జెలెన్స్కీ, అగ్రరాజ్యం ఇదే విధంగా ఇక ముందు కూడా రష్యాను ఎదుర్కొనేందుకు ఆర్దిక సహాయం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.


అమెరికా తమకు అందిస్తున్న సహాయం దానం కిందకు రాదని, ప్రపంచ భధ్రతకు ఇస్తున్న పెట్టుబడి అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కావల్సినన్ని ఫిరంగులు ఉన్నాయని కానీ, అవి దేనికీ అక్కరకు రావని చెప్పిన జెలెన్స్కీ, ఆ దేశంపై పైచేయి సాధించే ప్రక్రియను అమెరికా మాత్రమే వేగవంతం చేయగలదని స్పష్టం చేశారు.


గతంలో ఉక్రెయిన్ కు 50 బిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయం అందించిన అమెరికా, తాజాగా మరో 45 బిలియన్ డాలర్లను విడుదల చేసింది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోలేదని, తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పటికీ ఓటమిని అంగింకరించబోమని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ప్రపంచదేశాల దృష్టిలో తామే రష్యాను ఓడించినట్లని పేర్కొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story