Ukraine : కాళీమాతపై ఉక్రెయిన్ వ్యంగ్యమైన ట్వీట్..!

Ukraine : కాళీమాతపై ఉక్రెయిన్ వ్యంగ్యమైన ట్వీట్..!
X

తనను తాను రష్యా భారినుంచి రక్షించుకోలేని అల్పమైన ఉక్రేయిన్ దేశం, హిందూ దేవత కాళీ మాత చిత్రాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించింది. పైగా దానికి 'ఆర్ట్ ఆప్ వర్క్' గా అభివర్ణించింది. తమను రష్యా భారినుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ రక్షించాలని యుద్ధ తీవ్రతను తగ్గించే శక్తి భారత్ కు ఉందన్న ఉక్రెయిన్ అదే భారత దేవీ దేవతలపై అక్కసును వెళ్లగక్కింది. ఈ విషయంపై భారత నెటిజన్ల ఉక్రెయిన్ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ డిఫెన్స్ అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ లో కాళీమాత ఫోటోను అప్లోడ్ చేశారు. ఆ చిత్రంలో మేఘాలు ఎగురుతున్న గౌన్ లా ఉంటే దానిని కాళీమాత ఎగురకుండా పట్టుకున్నట్లు ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఉక్రెయిన్ మంత్రిత్వశాఖ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ మండి పడుతున్నారు. దీంతో సదరు మంత్రిత్వశాఖ ట్వీట్ ను డిలీట్ చేసింది. ఈ విషయాన్ని భారత సమాచార, మంత్రిత్వశాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా స్పంధించారు. ఉక్రెయిన్ ప్రభుత్వం తన నిజమైన ముఖాన్ని చూపిస్తుండటం సిగ్గుచేటని అన్నారు. ఉక్రెయిన్ విదేశాంగశాఖ సహాయకమంత్రి భారత్ సందర్శించి వెళ్ళిన తర్వాత ఇలాంటి చర్యను తాము ఊహించలేదని చెప్పారు. ఏ విదేశీ ప్రభుత్వం, దేశం చేయని విధంగా ఉక్రెయిన్... కాళీ దేవిని ఎగతాళి చేసిందని గుప్తా అన్నారు.

దేశవ్యాప్తంగా నెటిజన్లు ఉక్రెయిన్ ట్వీట్‌పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రష్యాపై జరుగుతున్న యుద్ధానికి సహాయం కోరిన తర్వాత ఉక్రెయిన్ భారతదేశాన్ని అవమానించిందని ప్రజలు ఉక్రెయిన్ ను నిందించారు.

https://twitter.com/KanchanGupta/status/1652568695758262273/photo/1

Tags

Next Story