Ukraine : రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలు కూల్చేశామన్న ఉక్రెయిన్

Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్ సైతం రష్యా సేనలపై ఎదురు దాడి చేస్తోంది. ఈ దాడిలో రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలు కూల్చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకుంటుందని అధ్యక్షుడు ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్‌కు అండగా అమెరికా బలగాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల వైపు అమెరికా తన యుద్ధ విమానాలను దింపుతోంది. రష్యా దాడికి ప్రతిదాడి తప్పదని హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. బలగాలను పెద్ద ఎత్తున దింపేందుకు సిద్ధమయ్యారు.
మరోవైపు ఉక్రెయిన్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. ఇప్పటి వరకు గగనతలం నుంచి బాంబులు, క్షిపణులతో దాడి చేస్తున్న రష్యా.. తన దళాలతో బెలారస్ నుంచి ఉక్రెయిన్‌లోకి చొరబడింది. తాము జనావాసాలపై దాడి చేయడం లేదని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని ఎయిర్‌బేస్‌లు, సైనిక స్థావరాలు, ఇతర ఆస్తులే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని తెలిపింది. మరోవైపు ఆక్రమణ ధోరణితోనే రష్యా పూర్తిస్థాయి యుద్ధం మొదలుపెట్టిందంటోంది ఉక్రెయిన్. రష్యాను ప్రపంచ దేశాలు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com