Ukraine: ఉక్రెయిన్ ఓ మంచి షూటింగ్ స్పాట్ .. RRRతో సహా అనేక చిత్రాలు..

Ukraine: ఉక్రెయిన్.. సినిమా పరిశ్రమలోని వారికి ఓ మంచి షూటింగ్ స్పాట్. ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొందని తెలిసి బాధపడుతున్నారు పరిశ్రమలోని వారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్‌తో సహా అనేక సినిమాలు, యాక్షన్ సన్నివేశాలను అక్కడే షూట్ చేస్తుంటారు. షూటింగ్ స్పాట్‌కి అనుకూలమైన ప్రదేశం ఉక్రెయిన్. అక్కడ ఏఏ సినిమాలను చిత్రీకరించారో తెలుసుకుందాం.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఉక్రెయిన్ విమానాశ్రయంపై రష్యా వరుస బాంబులు పేల్చడంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. సెన్సెక్స్ దారుణంగా పతనమైంది. బంగారం ధరలు భారీగా పెరిగాయి. సినీ ప్రపంచంపైనా దీని ప్రభావం అధికంగా ఉంటుంది.
RRR
గత ఏడాది ఆగస్టులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR తారాగణం, సిబ్బంది చిత్రం యొక్క చివరి షెడ్యూల్‌ను పూర్తిచేయడానికి ఉక్రెయిన్ వెళ్లారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRR భారత స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజుల కల్పిత కథ. ఈ చిత్రంలోని నాటు పాట ఉక్రెయిన్‌లో చిత్రీకరించినదే.
99 సాంగ్స్
ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, '99 సాంగ్స్' చిత్రానికి సహనిర్మాత. ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్‌లో జరిగింది. 99 సాంగ్స్‌లో ఆదిత్య సీల్, లిసా రే మరియు మనీషా కొయిరాలా సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఒక విజయవంతమైన సంగీతకారుడు కావాలనే ఆకాంక్షతో పోరాడుతున్న గాయకుడి గురించిన కథ.
2.0
ఉక్రెయిన్‌లోని టన్నెల్ ఆఫ్ లవ్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్‌పై ఓ సాంగ్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. రోజా కాదల్ అనే ఆ పాటను ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. ఈ ప్రదేశం చాలా అందంగా ఉందని చెబుతారు.
దేవ్
2019 రిలీజైన తమిళ రొమాంటిక్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. ఈ చిత్రంలో కార్తీ మరియు రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఉక్రెయిన్ కార్పాతియన్ పర్వతాలలో దేవ్ సన్నివేశాలు చిత్రీకరించారు.
విన్నర్
విన్నర్ యాక్షన్ కామెడీ చిత్రం. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు నటించారు. ఉక్రెయిన్‌లో మూడు పాటలను చిత్రీకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com