Ukraine Military : 3500 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామన్న ఉక్రెయిన్

Ukraine : ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన మొదలైంది. రష్యా దళాలను అడ్డుకుంటామన్న ఉక్రెయిన్.. ఎదురు దాడి చేస్తోంది. ఇప్పటి వరకు 3500 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. రష్యాకు చెందిన 14 ఫైటర్ జెట్స్, 8 హెలికాప్టర్లు కూల్చేశామని ఉక్రెయిన్ సైన్యం స్టేట్‌మెంట్ ఇచ్చింది.
అంతేకాదు 102 యుద్ద ట్యాంకులు, 536 వాహనాలు, బీయూకే సిస్టమ్‌ను నాశనం చేశామని ఉక్రెయిన్ చెబుతోంది. దాదాపు 200 మంది రష్యా సైనికులను బంధీలుగా పట్టుకున్నామంటోంది ఉక్రెయిన్. అయితే, వేయి మంది సైనికులను హతమార్చామని నిన్న ఉక్రెయిన్ చేసిన స్టేట్‌మెంట్‌ను రష్యా ఖండించింది.
తమ సైనికుల్లో ఎవరూ చనిపోలేదని రష్యా ప్రకటించింది. అంతలోనే 3500 మంది రష్యా సైనికులను హతమార్చినట్టు తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి ఎదురుదాడి మొదలవడంతో.. రష్యా తన సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. ఉక్రెయిన్ బలగాలు విరుచుకుపడొచ్చన్న సమాచారంతో.. ముందస్తుగా సరిహద్దు గ్రామాల్లోని రష్యన్లను తరలిస్తోంది.
ఇప్పటికే ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి చేస్తున్న రష్యా.. దాడి తీవ్రతను మరింత పెంచాలని చూస్తోంది. ఉక్రెయిన్ నుంచి ప్రతిఘటన ఎదురైతే.. పరిస్థితి మరింత దారుణంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com