Russia-Ukrain: ఉక్రెయిన్ మాస్టర్ మైండ్ బుడనోవ్..

Russia-Ukrain: ఉక్రెయిన్ మాస్టర్ మైండ్ బుడనోవ్..

రష్యాతో జరుగుతున్న యుద్ధంలో మేం సమాచారం(Information) అనే ఆయుధంతో వారిని దెబ్బకొడుతున్నాం అని ఉక్రెయిన్ ఛీప్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్ బుదనోవ్(Budanov) అంటున్నాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి సన్నిహితులతో తమకు సంబంధాలు ఉన్నాయని వెల్లడించాడు. ఇంత వరకు ఉన్న గూఢాచారుల్లాగా ఇప్పుడు ఎవరికీ కనబడకుండా ఉండి యుద్ధం చేయలేం అని వెల్లడించాడు.

2020 ఆగస్టులో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమింపబడ్డాడు. యుద్ధం ప్రారంభమైన తర్వాత యుద్ధం వెనక వ్యూహాలతో మాస్టర్ మైండ్‌గా ఉక్రెయిన్‌ ప్రజల్లో పేరు పొందాడు. ఇదే సమయంలో రష్యాలో ద్వేషాన్ని ఎదుర్కొంటున్నాడు. రష్యా అధికారులు 'రాక్షసుడు' అని అభివర్ణించారు.


అందరు నిఘా అధికారుల్లా, షాడోలో ఉండకుండా మీడియాతో పలు వివరాలు వెల్లడించాడు.

"ఇంతకు ముందులా దాక్కుని ఉంటూ పనిచేయడం గూఢచారులకు సాధ్యం కాదు. ఇకపై అలా జరగబోదు. రాబోయే కాలంలో జరగబోయే యుద్ధాలన్నీ కూడా ఇలానే జరుగుతాయి. ఆ విషయంలో మేమే ముందు ఉంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నాం" అని యుద్ధ ప్రణాళికలపై వివరించాడు.

రష్యా తమపై దాడి చేస్తుందని తాము ముందే పసిగట్టామని వెళ్లడించాడు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ విషయంలో మేము అనుకున్నదే రుజువైందన్నాడు.

సమాచారం కోసం మా సొంత వనరులు మాకున్నాయి. ఇంకా చెప్పాలంటే పుతిన్‌కి అత్యంత సన్నిహితమైన అధికారులతో సహా. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు ఏం జరుగుతోందనే విషయాలు తెలుస్తున్నాయన్నాడు.

2014లో క్రిమీయాపై రష్యా దాడి చేసినప్పుడు సరైన సమాచారం లేకపోవడంతోనే ఆ ద్వీపాన్ని మేం కోల్పోయాం అన్నాడు.

"2014లో సమాచార లోపం వల్ల, సమాచార యుద్ధంలో మేం ఓడిపోయాం. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం దానికి భిన్నమైనది. ఆ సమాచార యుద్ధంలో రష్యా వెనకడిపోతోందని" అని అన్నాడు. గత నెలలో రష్యా అధ్యక్షుడిపై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేయడంతో కొంత అస్థిరం కావడంతో ఆ అవకాశాన్ని సమాచారా సేకరణకు తన గూఢాచారులు వినియోగించుకున్నారన్నాడు. ఈ కిరాయి తిరుగుబాటుదారులు ఇంతకు ముందు బ్యాగ్‌లో పట్టేంత అణుబాంబుని తీసుకెళ్లడానికి న్యూక్లియర్ బేస్‌ వైపుకి వెళ్లారనే సమాచారం మాకుందని వివరించగా రష్యన్ అధికారులు దీనిని ధృవీకరించారు.



ప్రపంచంలో ఏ మూలన రష్యా ప్రజలు ఉన్నా, ఉక్రెయిన్ విజయం సాధించేదాకా వారిని చంపుతూనే ఉంటాం అని మే నెలలో ప్రకటించాడు. రష్యా యుద్ధానికి మద్ధతు తెలుపుతున్న ఒక బ్లాగర్, జర్నలిస్టులను చంపినట్టుగా రష్యా ఆరోపిస్తోంది.

గూఢాచారి అధికారిగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి బుడానోవ్‌పై కారు బాంబు పేల్చడం లాంటి హత్యాయత్నాలు జరిగాయి. మే నెలలో హెడ్ క్వార్టర్స్‌పై రష్యా భారీ వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో బుడానోవ్ తీవ్రంగా గాయపడ్డట్టు రష్యన్ మీడియా వెల్లడించింది. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి తాను ఏమీ గాయపడలేదని వెల్లడించాడు.

Tags

Read MoreRead Less
Next Story