Ukraine Russia War: రెచ్చిపోయిన రష్యా! క్రిస్మస్ రోజు బాంబులతో మోతెక్కిపోయిన ఉక్రెయిన్
ukraine

Ukraine Russia War: రెచ్చిపోయిన రష్యా! క్రిస్మస్ రోజు బాంబులతో మోతెక్కిపోయిన ఉక్రెయిన్
ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. పండగ పూట బాంబులతో విచురుచుకుపడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తాము చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ ఈ దాడి జరగడం ప్రపంచ దేశాలకు మింగుడుపడని పరిణామంగా మారింది.
సంధికి సుముఖంగా ఉన్న ఎవరితోనైనా చర్చించేందుకు తాము సిద్ధమని ప్రకటించిన పుతిన్ దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం వారికే వదిలేస్తామని వెల్లడించారు. చర్చలకు నిరాకరిస్తోంది తాము కాదని, వారే అని ఉక్రెయిన్ ను ఉద్దేశించి ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ స్పష్టం చేశారు.
అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు మఖైలో, పుతిన్ వ్యాఖ్యలకు విరుద్ధంగా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. పుతిన్ వాస్తవంలోకి రావాల్సిందిగా కోరిన మఖైలో రష్యానే ముందు నుంచి చర్చలకు విముఖంగా ఉందని స్పష్టం చేశారు. రష్యా ఏకగ్రీవంగా ఉక్రెయిన్ పై దాడి చేస్తూ తమ పౌరుల్ని పొట్టన పెట్టుకుంటోందని, చర్చలను పక్కకు తోసిపుచ్చి బాధ్యతలను విస్మరిస్తోందని ట్వీట్ చేశారు.
తొలుత పుతిన్ మాటలతో యుద్ధం ఆగినట్టేనని అంతా భావించారు. కానీ అందుకు వ్యతిరేకంగా పుతిన్ మారణకాండకు తెగబటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై రష్యా సైనికులు విరుచుకుపడుతున్నారు. ఖార్కీవ్ రీజన్ లోని పలు పట్టణాలపై రాకెట్లు, క్షిపణులతో దాడికి పాల్పడుతున్నారు. ఖార్కీవ్ ప్రాంతంలో 25 పట్టణాలు, జపోరిజియాయలో 20 నగరాలపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. దీంతో పుతిన్ వ్యాఖ్యలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదని స్పష్టం అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com