Ukraine War : యుద్దం పాలకులతో తప్ప, ప్రజలతో కాదు : పుతిన్
ఉక్రెయిన్ తో రష్యా సాగిస్తున్న యుద్ధం సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. తమ యుద్దం ఉక్రెయిన్ పాలకులతో తప్ప, ప్రజలతో కాదని అన్నారు. శాంతియుత మార్గాల ద్వారా 'డాన్ బాస్' సమస్యను పరిష్కరించడానికి మాస్కో ఎంతగానో ప్రయత్నించిందని అన్నారు. అందుకు ఉక్రెయిన్ నిరాకరించిందని తెలిపారు.
9వ శతాబ్ధంనుంచి డాన్ బాస్క్ అనే ప్రాంతం ఇరుదేశాల మధ్య వివాదంగా ఉంది. డాన్ బాస్క్ ప్రాంతం తమదంటే తమదని ఇరు దేశాలు గొడవ పడుతున్నాయి. రష్యా గతంలో కూడా ఉక్రెయిన్ ను ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. అది తనలో భాగంగానే చెబుతూ వచ్చింది. అయితే డాన్ బాస్క్ ప్రాంతాన్ని మాత్రం రష్యా వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు సంకేతాలు ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే రష్యా కు ఉక్రెయిన్ కు గొడవ ముదిరి యుద్ధంగా మారింది.
ఉక్రెయిన్ అనవసరమైన యుద్ధాన్ని ప్రారంభించిందని అన్నారు పుతిన్. యుద్దాన్ని ఆపడానికి తాము ప్రయత్నించామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వడంతో గొడవ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు యుద్దంలో 7వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ ప్రజలు వలస వెళ్లారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com